IPL 2026 SRH Captain Update: సన్‌రైజర్స్ జట్టుకు కొత్త కెప్టెన్ గా అభిషేక్ శర్మ.. కమ్మిన్స్ ఔట్..!

సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కు అదిరిపోయే వార్త వైరల్ గా మారింది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ గాయం కారణంగా మొదటి కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో అభిషేక్ శర్మ పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు టాక్ జోరుగా సాగుతోంది.

New Update
Summer AC Tips (1)

ఐపీఎల్ 2026 సీజన్ కు సంబంధించి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కు అదిరిపోయే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ గాయం కారణంగా మొదటి కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో SRH కు కొత్త కెప్టెన్ గా యువ ఆటగాడు అభిషేక్ శర్మ పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు నెట్టింట టాక్ జోరుగా సాగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

SRH జట్టు ఈ సారి ఫుల్ జోష్ మీదున్నట్లు తెలుస్తోంది. టాప్ ప్లేయర్స్ అందరూ ఆ జట్టులోనే ఉండటంతో ఈసారి ఊరమాస్ బ్యాటింగ్ ఉండబోతున్నట్లు ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అయితే జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ వెన్ను నొప్పి కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. కాగా అతడు గతంలో ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్ కు గాయం కారణంగా మధ్యలోనే దూరమయ్యాడు. 

అయితే ప్రస్తుతం కమ్మిన్స్ కోలుకుంటున్నప్పటికీ.. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ సమయానికి పూర్తిగా ఫిట్ నెస్ సాధిస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఒకవేళ కమ్మిన్స్ అందుబాటులోకి రాకపోతే మాత్రం యువ ప్లేయర్ అభిషేక్ శర్మను కెప్టెన్ గా నియమించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మేనేజ్ మెంట్ సైతం ఇదే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే అభిషేక్ తో పాటు మరో పేరు కూడా బలంగా వినిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ లో విధ్వంసకర బ్యాటింగ్ చేసిన ఇషాన్ కిషన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. చూడాలి చివరికి ఏం జరుగుతుందో.

సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్

BCCI ఇప్పటివరకు IPL 2026 కోసం కేవలం 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసింది. హైదరాబాద్ జట్టు మార్చి 28న డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇదే IPL 2026 టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్.

మార్చి 28 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - బెంగళూరులో
ఏప్రిల్ 2 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - కోల్‌కతాలో
ఏప్రిల్ 5 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ - హైదరాబాద్ లో
ఏప్రిల్ 11 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ - న్యూ చండీగఢ్ లో

Advertisment
తాజా కథనాలు