/rtv/media/media_files/2025/03/09/BuUKHKdMMbnPJWmtxaaA.jpg)
India Loss Toss
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడిపోయింది. దీంతో న్యూజిలాండ్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. వరుసగా 15వ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడిపోవడం గమనార్హం. దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్‌ను వీక్షేంచేందుకు కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. టీమ్ ఇండియా గెలవాలని ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ ఆడటం లేదు. అతడి స్ధానంలో నాథన్ స్మిత్ టీమ్‌లోకి వచ్చాడు. టీమిండియా మాత్రం ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది.
#ICCChampionsTrophy | New Zealand win the toss and opt to bat first against India in the finals at Dubai International Cricket Stadium. #IndvsNZ pic.twitter.com/H5ddydpbaN
— ANI (@ANI) March 9, 2025
భారత జట్టులో.. రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.
ఇక న్యూజిలాండ్ జట్టులో.. విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కైల్ జేమిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్ ఆడుతున్నారు.