/rtv/media/media_files/2025/02/20/xZIWcJwBChm56QU73HeC.jpg)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్ను నేడు బంగ్లాదేశ్‌తో ఆడనుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఊపు మీద ఉంది. అలాంటి టీమిండియాకు బంగ్లాపై గెలుపు పెద్దగా కష్టమేమీ కాకపోవచ్చు. విరాట్, రోహిత్ ఫామ్‌లో ఉన్నారు. అయితే బుమ్రా లేని బౌలింగ్ దళం ఎలా ఆడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక బంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వేయొద్దని, నిర్దయగా ఆడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
Also Read : చైనా దుందుడుకు చర్య..ఫిలిప్పీన్స్ విమానాన్ని గుద్దేస్తామంటూ ఆట్లాట
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. దుబాయ్ స్టేడియంలో వన్డే ఫార్మాట్‌లో భారత జట్టుకు అద్భుతమైన రికార్డు ఉంది. ఈ స్టేడియంలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఈ స్టేడియంలో ఇప్పటివరకు భారత్ మొత్తం 6 వన్డే మ్యాచ్‌లు ఆడగా, అందులో 5 గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఒక మ్యాచ్ టై అయింది. ఈ మైదానంలో భారత జట్టు వన్డేల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లను చరో రెండు సార్లు ఓడించగా.. ఒకసారి హాంకాంగ్‌ను ఓడించింది.
Also Read : రాజలింగమూర్తి మర్డర్ వెనుక మేఘా? .. కాళేశ్వరంపై కేసు వేసినందుకే ఖతం!
ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం రికార్డును పరిశీలిస్తే ఇందులో భారత జట్టు రికార్డు కూడా అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు భారత్ టోర్నమెంట్‌లో మొత్తం 29 మ్యాచ్‌లు ఆడగా, అందులో 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 8 మ్యాచ్‌లో ఓడిపోయింది. మరో 3 మ్యాచ్‌లు టై అయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టు పరంగా కూడా భారత్ అగ్రస్థానంలో ఉంది.
Also Read : మస్క్ చేసేది అన్యాయయే..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
భారత్-బంగ్లాదేశ్ జట్ల అంచనా..
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్ మరియు వాషింగ్టన్ సుందర్.
బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తంజిద్ హసన్, తౌహీద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, జాకర్ అలీ అనిక్, మెహదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, నహిద్ రాణా
Also Read : Rekha Gupta Net Worth : సొంత కారు కూడా లేదు .. ఢిల్లీ కొత్త సీఎం ఆస్తులెంత.. అప్పులెంత?