బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టు రసవత్తరంగా సాగుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ప్రస్తుతం 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ప్రస్తుతం జడేజా (8*), వాషింగ్టన్ సుందర్ (6*) క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా అధిక్యం 145 పరుగులకు చేరుకుంది. రిషభ్ పంత్ (61) 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. జడేజా, సుందర్ మూడో రోజు క్రీజ్ లో ఉంటే టీమిండియా భారీ టార్గెట్ ను ఆసీస్ ముందు పెట్టవచ్చు. నాలుగు పరుగుల అధిక్యంతో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన టీమిండియా ఆటలో ఎలాంటి మార్పు కనిపించలేదు. తొలి ఓవర్‌లోనే నాలుగు ఫోర్లు బాది ఫుల్ జోష్ లో కనిపించిన యశస్వి జైస్వాల్ (22) త్వరగానే వెనుదిరిగాడు. ఆ తరువాత కేఎల్ (13), విరాట్ కోహ్లీ (6), శుభ్‌మన్ గిల్ (13) తక్కువ పరుగులకే వికెట్లు సమర్పించుకుని మరోసారి నిరాశపరిచారు. దీంతో టీమిండియా స్కోర్ 41/0తో ఉండగా.. స్కోరు 78/4కి పడిపోయింది. ఇలాంటి టైమ్ లో క్రీజ్ లోకి వచ్చిన రిషభ్ పంత్ తగ్గేదే లే అన్నట్టుగా దూకుడుగా ఆడాడు. స్టార్క్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదేశాడు. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. 33 బంతుల్లో 61 పరుగులు చేసిన పంత్ ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్ లో వికెట్ సమర్పించుకున్నాడు. బౌలర్లు సూపర్ సిడ్నీ టెస్టులో టీమిండియా స్వల్ప ఆధిక్యం దక్కించుకోవడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ఓవర్ నైట్ 9/1తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ను బుమ్రా (2/33) దెబ్బ కొట్టాడు. మార్నస్ లబుషేన్ (2)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత సిరాజ్ (3/51), ప్రసిధ్ (3/42), నితీశ్ (2/32) అదరగొట్టారు. ఇన్నింగ్స్ 31వ ఓవర్ తర్వాత వెన్ను నొప్పితో బుమ్రా మైదానం వీడాడు. ఈ టైమ్ లో కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించాడు. Also Read : రిషబ్ పంత్ విధ్వంసం.. ఫోర్లు, సిక్సర్లతో హల్ చల్