Ind Vs Pak: ఇదో అరుదైన రికార్డు.. పాక్‌పై కోహ్లీ సెంచరీని ఎన్ని కోట్ల మంది చూశారంటే?

భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను కొన్ని కోట్లమంది వీక్షించారు. జియోహాట్‌స్టార్‌ లైవ్‌లో ఈ మ్యాచ్‌ వ్యూస్‌లో రికార్డు సృష్టించింది. తొలి ఓవర్‌‌కు 6.8కోట్లు ఉండగా.. కోహ్లి సెంచరీ సమయానికి 60.2 కోట్లకు చేరుకుంది. గతంలో క్రికెట్లో ఏ మ్యాచ్‌కు ఇన్ని వీక్షణలు రాలేదు.

New Update
ind vs pak cricket match 60.2 crores of people watched in jio hotstar

ind vs pak cricket match 60.2 crores of people watched in jio hotstar

భారత్ - పాకిస్థాన్ మధ్య మ్యాచ్ నిన్న (ఆదివారం) అత్యంత రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. పాక్ నిర్ధేశించిన పరుగులను భారత్ అలవోకగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ చెలరేగిపోయాడు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే.. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎన్నో నెలల నుంచి ఆసక్తిగా ఎదురుచూశారు. 

ఇది కూడా చదవండి: Uganda-Indian Woman:లంచం ఇచ్చాకే నీళ్లు, ఫుడ్. జైలు కష్టాలను గురించి చెప్పకొచ్చిన భారత బిలియనర్ కుమార్తె

భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌ను ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఉత్కంఠగా ఎదురుచూశారు. ఇందులో భాగంగానే నిన్న మ్యాచ్ ప్రారంభం అయింది. ఈ మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించేందుకు క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో హాట్‌స్టార్‌ వేదికకు వచ్చారు. 5కోట్లు కాదు 10 కోట్లు కాదు ఏకంగా 60 కోట్ల మంది లైవ్‌లో ఈ మ్యాచ్‌ను తిలకించారు. దీంతో ఇదో అతి పెద్ద రికార్డు. 

ఇది కూడా చదవండి: Champions Trophy: ఎడారి దేశంలో...దాయాది పోరులో రికార్డుల మోత

వ్యూస్‌లో రికార్డు

అయితే మొదట పాక్ జట్టు బ్యాటింగ్ చేయడంతో పెద్దగా చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరచలేదు. మహ్మద్ షమి తొలి ఓవర్ వేసినపుడు కేవలం 6.8 కోట్ల మందే చూశారు. అలా పాక్ ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 32.2 కోట్లకు చేరింది. ఇక భారత్ బ్యాటింగ్‌కు దిగడంతో అది కాస్త పెరిగి 36.2 కోట్ల మంది వీక్షించారు. అదే సమయంలో కోహ్లీ సెంచరీ చేసే టైంలో దాదాపు 60.2 కోట్ల మంది ఈ మ్యాచ్‌ను తిలకించడం విశేషం. ఇదో అరుదైన రికార్డు. గతంలో ఎప్పుడూ క్రికెట్లో ఏ మ్యాచ్‌కు ఇన్ని వీక్షణలు రాలేదని సమాచారం.  

Also Read: Champions Trophy: పాక్ పై గెలుపుతో అదరగొట్టిన భారత్..విజయాలు సమం..

ఈ మ్యాచ్‌తో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్‌ కొహ్లీ చరిత్ర సృష్టించారు. వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పారు. ఛాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లి 15 పరుగులు వద్ద ఈ మైలురాయిని దాటాడు. సచిన్‌, సంగక్కరల రికార్డులను సైతం బ్రేక్ చేశాడు.

Also Read: IND vs PAK Champions Trophy 2025 LIVE Updates: పాక్‌పై భారత్ ఘనవిజయం 

సచిన్ టెండుల్కర్‌ 350 ఇన్నింగ్స్‌లో 14 వేల పరుగులు చేశాడు. కానీ విరాట్ కోహ్లి 287 ఇన్నింగ్స్‌లోనే 14 వేల పరుగులు దాటాడు. ఇప్పటివరకు వన్డేల్లో ఇద్దరు క్రికెటర్లు మాత్రమే 14 వేల కన్నా ఎక్కువ పరుగులు చేశారు. తాజాగా కోహ్లి మూడో స్థానంలోకి చేరుకున్నాడు. ఇందులో సచిన్‌ టెండుల్కర్ (భారత్‌) 18,426 పరుగులు, కుమార సంగక్కర (శ్రీలంక) 14,234 పరుగులు, విరాట్‌ కోహ్లి (భారత్‌) 14,002 పరుగులు చేసినవాళ్లుగా ఉన్నారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు