IND vs AUS : ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ .. రివేంజ్కు టీమిండియా ప్లాన్!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవ్వాళ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 2023 ప్రపంచకప్లో ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా.. అందులో టీమిండియా ఓడిపోయింది.అందుకు ప్రతీకారంగా ఈమ్యాచ్లోఆస్ట్రేలియాను ఓడించాలని టీమిండియా భావిస్తోంది.

New Update
ind vs Aus

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇవ్వాళ తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 2025 మార్చి 04వ తేదీ మంగళవారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.  దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.  రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. గ్రూప్ దశలో ఆడిన మ్యాచ్‌లు గెలిచింది. ఇప్పుడు సెమీ-ఫైనల్ లోనూ గెలిచి ఫైనల్ లో అడుగు పెట్టాలని చూస్తుంది.  

ఆస్ట్రేలియాతో సెమీ-ఫైనల్ టీమిండియాకు సెంటిమెంట్ అనే చెప్పాలి. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్ లలో టీమిండియా ఆస్ట్రేలియాతో సెమీ-ఫైనల్ మ్యాచ్  ఆడి  ఫైనల్ కు వెళ్లింది.  2023 ప్రపంచ కప్ ఫైనల్‌లో  ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా.. అందులో టీమిండియా ఓడిపోయింది.  అందుకు ప్రతీకారంగా ఈమ్యాచ్ లోఆస్ట్రేలియాను భారత్ కచ్చితంగా ఓడించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. 

ఈసారి ఆస్ట్రేలియా జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ఫాస్ట్ బౌలర్లు పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్ ఈ జట్టులో లేరు. కమిన్స్ చీలమండ గాయంతో, హాజిల్‌వుడ్ తుంటి గాయంతో బాధపడుతున్నారు. స్టార్క్ వ్యక్తిగత కారణాల వల్ల జట్టుకు దూరంగా ఉండగా, మార్ష్ కూడా గాయపడ్డాడు. మరోవైపు, టోర్నమెంట్‌కు ముందే స్టోయినిస్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో భారత్ vs ఆస్ట్రేలియా

మొత్తం మ్యాచ్‌లు: 7
భారత్ విజయం: 3
ఆస్ట్రేలియా విజయం: 4

 జట్ల అంచనా..  

భారత్  :  రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్.

ఆస్ట్రేలియా :  స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘ, కూపర్ కొన్నోల్లీ, ఆడమ్ జంపా.3

Also read :   Kiran Bedi: చిరంజీవికి కిరణ్‌ బేడీ స్ట్రాంగ్ కౌంటర్.. కూతుళ్లు కూడా వారసులే అంటూ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు