టీమిండియా స్టార్ ప్లేయర్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి.. ఆస్ట్రేలియా గడ్డపై మారు మోగిన పేరు ఇది. ఆసీస్‌ను వారి సొంతం గడ్డపైనే గడగడలాడించిన క్రికెటర్ నితీష్ రెడ్డి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో దుమ్ము దులిపేశాడు. ఇది కూడా చూడండి: తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం చరిత్ర సృష్టించాడు Nitish Kumar Reddy 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నితీష్ అదరగొట్టేశాడు. భారత్‌ను ఫాల్‌ఆన్ గండం నుంచి బయటపడేయటమే కాకుండా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాలో సెంచరీ సాధించిన తొలి భారతీయ బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. తన టెస్ట్ కెరీర్‌లో సైతం తొలి సెంచరీ కావడం విశేషం. ఇది కూడా చూడండి: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతి సర్వత్రా ప్రశంసలు Nitish Reddy దీంతో నితీష్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. సెంచరీ చేసిన వెంటనే ఆసీస్ మైదానం దద్దరిల్లిపోయింది. టీమిండియా ప్లేయర్స్ తో పాటు ప్రత్యర్థి ప్లేయర్లు సైతం ఈ యంగ్ క్రికెటర్‌కు అభినందనలు తెలిపారు. స్టేడియంలో క్రికెట్ అభిమానుల అరుపులు, కేకలతో నితీష్ రెడ్డి పేరు మార్మోగిపోయింది. స్వదేశంలోనూ నితీష్ రెడ్డికి భారీగా అభినందనలు వెల్లువెత్తాయి. ప్రముఖ రాజకీయ నాయకులు సైతం వైజాగ్ కుర్రాడి ఆటకు ఫిదా అయిపోయారు. ఇది కూడా చూడండి: యశ్వస్విపై రోహిత్ ఆగ్రహం.. వెల్లువెత్తుతున్న విమర్శలు భారీ నజరానా Nitish Kumar Reddy అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఒక తెలుగు కుర్రాడు ప్రపంచ స్థాయి క్రికెట్‌లో సత్తా చాటడం ఎంతో గర్వంగా ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు నితీష్‌ను కొనియాడారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలన్నారు. అదే సమయంలో ఈ వైజాగ్ కుర్రాడు నితీష్‌కి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ నజరానా ప్రకటించింది. దాదాపు రూ.25 లక్షలు నజరానా అందింది. ఇలా నితీష్ రెడ్డి పేరు భారత్ టు ఆస్ట్రేలియా వరకు మార్మోగిపోయింది. ఇది కూడా చూడండి: మాజీ ప్రధాని అస్థికల నిమజ్జనం.. ఎక్కడ చేశారంటే? నితీశ్ శ్రమ వృథా Nitish Kumar Reddy:. ఎంత ఆడినా?.. ఎన్ని పరుగులు చేసినా?.. ఎంత శ్రమించినా? ఫలితం లేకుండా పోయింది. నితీష్ రెడ్డి శ్రమ వృథా అయింది. గ్రౌండ్‌లో చెమటోడ్చిన నితీష్ సెంచరీ నీరుగారిపోయింది. టీమిండియా దాదాపుగా టెస్టు ఛాంపియన్ షిప్ బెర్త్‌ను కోల్పోయింది. ఇవాళ (డిసెంబర్ 30)న జరిగిన నాలుగో (బాక్సింగ్ డే) టెస్టులో ఆసీస్ 184 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ తప్ప అందరూ విఫలం అయ్యారు. నితీష్ రెడ్డి కేవలం (1) పరుగు మాత్రమే చేశాడు. మొత్తంగా తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి సెంచరీ వృథా అయిందనే చెప్పాలి.