India vs Australia 4th Test: పుష్ప స్టైల్లో నితీశ్ రెడ్డి.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే!

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ నితీశ్ రెడ్డి చెలరేగాడు. 50 పరుగులు చేసిన వెంటనే ఆస్ట్రేలియా అభిమానుల ముందు పుష్ప స్టైల్లో సంబరాలు చేసుకున్నాడు. దీంతో భారత అభిమానుల సందడితో స్టేడియం మొత్తం దద్దరిల్లింది.

New Update
Nitish Reddy

Nitish Reddy Pushpa Style

ఆస్ట్రేలియా  - భారత్ మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 అత్యంత రసవత్తరంగా జరుగుతోంది. మెల్‌బోర్న్ వేదికగా నాలుగో (బాక్సింగ్ డే) టెస్ట్ కొనసాగుతోంది. ఇందులో టీమిండియా స్టార్ అండ్ యంగ్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. పుష్పా రేంజ్‌ అవతారంలో దుమ్ముదులిపేస్తున్నాడు. 

ALSO READ: స్కూళ్లకు 15 రోజుల సెలవులు

ALSO READ: కేటీఆర్ కు ఈడీ నోటీసులు

టీమ్ ఇండియా కష్టాల్లో ఉన్న సమయంలో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి ఆపద్భాంధవుడిలా జట్టును ఆదుకున్నాడు. ఈ తరుణంలోనే బాక్సిండే టెస్టులో హాఫ్ సెంచరీ చేశాడు. అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లో తన కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ ఇదే కావడం గమనార్హం. ఇది వరకు జరిగిన మ్యాచ్‌లలో 40 పరుగుల వరకు చేశాడు.. కానీ హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. 

ALSO READ: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 2025లో సెలవులే సెలవులు

పుష్ప స్టైల్లో నితీశ్ రెడ్డి

ALSO READ: కడప జిల్లాలో విషాదం.. అప్పుల బాధ తాళలేక రైతు కుటుంబం ఆత్మహత్య

అయితే ఈ నాలుగో టెస్టులో మాత్రం హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టేశాడు. 81 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అదే క్రమంలో హాఫ్ సెంచరీ చేసే ముందే బౌండరీ కొట్టి అదరగొట్టేశాడు. ఆ బౌండరీతో 50 రన్స్ చేశాడు. దీంతో అల్లు అర్జున్ పుష్ప స్టైల్లో దీనవ్వా తగ్గేదే లే అన్నట్లుగా రచ్చ చేశాడు. దీంతో అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు టీమిండియా ఫాలోఆన్‌ గండం నుంచి తప్పించుకుంది. అవసరమైన 275 పరుగులను పూర్తి చేయడంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకుంది.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు