నవంబర్ 29న ఖరారు అవ్వాల్సిన షెడ్యూల్ ఇవాల్టికి కూడా తేలలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ మీద ఇవాళ జరిగిన మీటింగ్ కూడా వాయిదా పడింది. డిసెంబర్ 7న మళ్ళీ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ కార్యదర్శి జైషా ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సమావేశం కావడంతో అందరిలోనూ ఉత్కంఠ రేగింది. ఇప్పుడు వాయిదా పడటంతో ఇంకాన్నాళ్ళు నానుస్తారు ఈ విషయాన్ని అంటూ విసుగు ప్రదర్శిస్తున్నారు. ఎటూ తేల్చని పాక్.. వచ్చే ఏడాది పాకిస్తాన్ అతిథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ ఆడటానికి బీసీసీఐ ఒప్పుకోలేదు. పాకిస్తాన్‌లో టోర్నీ జరిగితే అస్సలు ఆడమని, మొత్తం ఛాంపియన్స్ ట్రోఫీ నుంచే తప్పుకుంటామని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో పీసీబీని హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించాలని.. ఐసీసీ చెప్పింది. ఈ విషయం మీద ఇప్పటి వరకు పీసీబీ ఎటూ తేల్చలేదు. ఇవాళ జరిగిన బ్రీఫ్ సెషన్‌లోనూ పాక్ క్రికెట్ బోర్డు ఎదుట ఐసీసీ ఇదే ఆప్షన్‌ను ఉంచింది. మళ్ళీ ఎప్పటిలానే పాక్ క్రికెట్ బోర్డు ఏ విషయం చెప్పలేదు. దీంతో రెండు రోజుల తరువాతకు సమావేశం వాయిదా వేశారు. అయితే నెక్స్ట్ మీటింగ్‌లో కూడా పాక్ ఏ విషయం తేల్చకపోతే మాత్రం ఆతిథ్య హక్కులను జైషా నేతృత్వంలోని ఐసీసీ వేరే దేశానికి ఇచ్చేయడం ఖాయమని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అప్పుడు ఆర్థికంగా పాక్ బోర్డుకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. Also Read: VIRAL: ముచ్చట గొలుపుతున్న నాగచైతన్య–శోభిత పెళ్ళి ఫోటోలు