/rtv/media/media_files/2025/03/09/kZ4vPZ0DpVGwiEwYBljh.jpg)
ICC Champions Trophy 2025 Final Photograph: (ICC Champions Trophy 2025 Final)
ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ నేడే జరగనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2:30 నిమిషాలకు భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఐసీసీ భారీగానే ప్రైజ్ మనీని ఇవ్వనుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన జట్టుకు 2.24 మిలియన్ డాలర్లు ఐసీసీ ప్రైజ్ మనీగా ఇవ్వనుంది. ఇండియన్ కరెన్సీలో సుమారుగా రూ.19.5 కోట్లు అన్నమాట.
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!
Are you ready for the #ChampionsTrophy 2025 final? 😍
— ICC (@ICC) March 8, 2025
Match details ➡️ https://t.co/NHbnqbFDpt pic.twitter.com/qDAnau7KC4
ఇది కూడా చూడండి: Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?
దుబాయ్ వేదికగా మ్యాచ్..
ఈరోజు భారత్ , న్యూజిలాండ్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈరోజు హద్యాహ్నం దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం అవనుంది. ఇందులో భారత్ ఫేవరెట్ గా ఉంది. కానీ న్యూజిలాండ్ కూడా చాలా బలమైన జట్టుగానే బరిలోకి దిగుతోంది. ఇక ఫైనల్ మ్యాచ్ లో భారత్ గెలిచి ట్రోఫీని తీసుకురావాలని అందరూ అనుకుంటున్నారు.
ఇది కూడా చూడండి: TG News: మహిళలపై సీఎం రేవంత్ వరాల జల్లు.. ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 పాలసీ ప్రకటన!
12 ఏళ్ళ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రఓపీ టీమ్ ఇండియా కైవసం చేసుకోవాలని కలలు కంటున్నారు. మరోవైపు ఈ మ్యాచ్ మీద బెట్టింగ్స్ కూడా అంతే జోరుగా సాగుతున్నాయి. దాదాపు రూ.5 వేల కోట్ల పందాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో దావూద్ కు సంబంధించిన డీ కంపెనీ కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు.