/rtv/media/media_files/2025/03/10/It4aEZNBDuvLWPDpUpDD.jpg)
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జట్టును ఐసీసీ ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి ఆరుగురికి చోటు దక్కగా.. కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం చోటు దక్కలేదు. ఇందులో న్యూజిలాండ్ నుంచి మిచెల్ సాంట్నర్ ను కెప్టెన్ గా తీసుకుంది. భారత్ నుంచి విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ (12 వ ఆటగాడిగా)చోటు కలిపించింది. ఇక మాట్ హెన్రీ (న్యూజిలాండ్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (ఆఫ్ఘనిస్తాన్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్), రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్) లను మిగితా సభ్యులుగా చేర్చింది. అయితే టీమిండియాను విజేతగా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం ఇందులో చోటు దక్కకపోవడం అతన్ని అవమానించినట్లేనని భారత క్రికెట్ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.
Also Read : సైలెన్స్కు బ్రేక్.. రిటైర్మెంట్ పై జడేజా కీలక ప్రకటన!
ICC announces Champions Trophy 2025 Team of the Tournament.
— ANI (@ANI) March 10, 2025
Rachin Ravindra (New Zealand)
Ibrahim Zadran (Afghanistan)
Virat Kohli (India)
Shreyas Iyer (India)
KL Rahul (wk) (India)
Glenn Phillips (New Zealand)
Azmatullah Omarzai (Afghanistan)
Mitchell Santner (c) (New Zealand)… pic.twitter.com/m9dXnbzHMV
ఏ ఒక్క ఆటగాడికి కూడా
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విరాట్ కోహ్లీ 218 పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ 243 పరుగులు చేశాడు. భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి ఇద్దరూ చెరో 9 వికెట్లు పడగొట్టి భారత్‌ను విజేతగా మార్చడంలో కీ రోల్ పోషించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి పెద్ద జట్ల నుండి ఒక్క ఆటగాడికి కూడా అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవెన్‌లో స్థానం లభించలేదు.
Also read : కండలా.. నీలగిరి కొండలా - వధువు బాడీ చూస్తే మతి పోవాల్సిందే గురూ!
Also Read : రష్మిక ప్రాణాలకు ముప్పు.. కేంద్ర, రాష్ట్ర హోం మంత్రులకు లేఖలు!