నిన్నటి నుంచి సోషల్ మీడియా ఒకటే గోల చేస్తోంది. నిన్న ఆస్ట్రేలియాతో ఐదవ టెస్ట్ మొదలవడం...అందులో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడకపోవడం పెద్ద దుమారమే రేపింది. కావాలనే కోచ్ గంభీర్.. రోహిత్‌ను పక్కన పెట్టాడన్న వార్త చక్కర్లు కొట్టింది. భారత క్రికెట్ అభిమానులు ఊకుమ్మడిగా గంభీర్ మీద దాడి చేశారు. కెప్టెన్సీ నుంచి తప్పించడం వరకు ఓకే కానీ అసలు ఆడనివ్వకపోవడం ఏంటంటూ మండిపడ్డారు. అయితే తరువాత రోహిత్ స్వయంగా తానే కావాలని ఆడటం లేదని ప్రకటించడంతో కాస్త చల్లబడ్డారు. Also Read: USA: ప్రమాణ స్వీకారానికి ముందు హష్ మనీ కేసు విచారణకు ట్రంప్ Also Read: SM: తల్లిదండ్రుల పర్మిషన్ ఉండాల్సిందే..సోషల్ మీడియాపై కేంద్రం నిర్ణయం! అప్పుడే రిటైర్ అవ్వను.. ఈలోపు మరో ఊహాగానం తెగ ఊపందుకుంది. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ మొత్తం రోహిత్ శర్మ అస్సలు బాగా ఆడలేదు. దాంతో పాటూ చివరి టెస్ట్‌లో స్టాండ్స్‌కు పరిమితమయ్యాడు. దీంతో రోహిత్ ఇక రిటైర్ అయిపోతాడని అందరూ అనుకున్నారు. మెల్‌బోర్స్ టెస్టే అతని చివరి టెస్ట్ అంటూ క్రికెట్ పండితులు జోస్యం కూడా చెప్పేశారు. ఇప్పుడు హిట్ మ్యాన్ ఆ వార్తలకు కూడా చెక్ పెట్టేశాడు. తానేమీ రిటైర్ అవ్వడం లేదని...కేవలం చివరి టెస్ట్ కు మాత్రమే ఆడటం లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం తన ఫామ్ సరిగ్గా లేనందువల్ల, చివరి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాల్సి ఉండడం వల్లనూ తాను ఆడకూడదని నిర్ణయం తీసుకున్నాని తేల్చి చెప్పాడు. పెర్త్ టెస్టులో కేఎల్ రాహుల్ - యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ జోడీని మార్చకూడదనే ఉద్దేశంతో..జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. ఎవరో బయట కూర్చుని తన రిటైర్మెంట్ డిసైడ్ చేయడమేంటని ఆగ్రం వ్యక్తం చేశాడు రోహిత్. త్వరలోనే తను ఫామ్ లోకి వస్తానని.. చక్కగా మరికొన్నాళ్ళు ఆడతానని స్పష్టం చేశాడు. Also Read: Cricket: 96 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా