భారత్ - ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సిరీస్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. తొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించగా.. రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. ఇక త్వరలో మూడో టెస్ట్ సిరీస్ జరగనుంది. డిసెంబర్ 14 నుంచి మూడో టెస్ట్ సిరీస్ బ్రిస్బేన్‌లో గబ్బా స్టేడియం వేదికగా జరగనుంది. ఇది కూడా చూడండి: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ మూడో సిరీస్ టెస్ట్ కోసం ఇరు జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ తరుణంలో టీమిండియా తుది జట్టులో మార్పులు జరుగుతాయని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపారు. ఈ మేరకు ఒక అంచనా వేశారు. తుది జట్టులో రెండు ఛేంజెస్ జరుగుతాయన్నారు. అదే సమయంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదని సూచించారు. కెప్టెన్ రోహిత్ శర్మ యధావిధిగా ఆరో స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగాలని పేర్కొన్నారు. ఇది కూడా చూడండి: బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులు జరగకూడదని అనుకుంటున్నానని తెలిపారు. అయితే రోహిత్ ఓపెనర్‌గా రావాలని ఇప్పటికే చర్చలు జరిగాయాని.. సునీల్ గవాస్కర్ సైతం రోహిత్ ఓపెనర్‌గా వస్తే బాగుంటుందని తెలిపినట్లు పేర్కొన్నారు. కానీ టీమ్ మేనేజ్‌మెంట్ అలా ఆలోచించదని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక! కాగా స్పిన్ విభాగంలో ఒక ఛేంజ్ జరిగే అవకాశం ఉందని తెలిపారు. వాషింగ్టన్ సుందర్.. అశ్విన్ స్థానంలో తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. సుందర్ తొలి టెస్టులో రెండు వికెట్లు తీయడమే కాకుండా.. బ్యాటింగ్‌లో కూడా పర్వాలేదనిపించాడన్నారు. ఇక ఫాస్ట్ బౌలింగ్ విషయంలో కూడా మరో మార్పు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇది కూడా చూడండి: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం హర్షిత్ రాణా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అతడు హైట్ ఉంటాడు కాబట్టి బౌన్స్ బాగా రాబట్టగలడని తెలిపారు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.