ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్.. భారత్, పాక్ మధ్య మ్యాచ్ ఎప్పుడంటే?

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజైంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు నిర్వహించనున్నారు. హైబ్రిడ్ మోడల్‌‌లో జరగనున్న ఈ ట్రోఫీలో భారత్ దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడనుంది.

New Update
Champions Trophy

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వచ్చే ఏడాది జరగనుంది. పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. హైబ్రిడ్ మోడల్‌లో జరగనున్న ఈ ట్రోఫీలో భారత్ తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఇందులో 8 జట్లు మధ్య మొత్తం 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. అన్ని జట్లును రెండు గ్రూపులుగా విభజించారు. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ గ్రూప్-ఏలో ఉండగా.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌, ఇంగ్లాండ్‌ గ్రూప్‌-బిలో ఉన్నాయి. మ్యాచ్‌లు అన్ని కూడా డే అండ్ నైట్‌ జరుగుతాయి. దుబాయ్‌ వేదికగా భారత్‌, పాకిస్థాన్‌కి ఫిబ్రవరి 23న మ్యాచ్ జరగనుంది.

ఇది కూడా చూడండి: అశ్విన్‌ స్థానంలో మరో యంగ్ స్పిన్నర్‌కు చోటు.. అతడెవరంటే! 

ఇది కూడా చూడండి: Jani Master: అల్లు అర్జున్ అరెస్ట్ పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్ వైరల్

ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్...

ఫిబ్రవరి 19 - పాకిస్తాన్ vs న్యూజిలాండ్, కరాచీ
ఫిబ్రవరి 20 - బంగ్లాదేశ్ vs ఇండియా, దుబాయ్
ఫిబ్రవరి 21  - ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా, కరాచీ
ఫిబ్రవరి 22 - ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, లాహోర్
ఫిబ్రవరి 23 - పాకిస్తాన్ వర్సెస్ ఇండియా, దుబాయ్
ఫిబ్రవరి 24 - బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్, రావల్పిండి
ఫిబ్రవరి 25 - ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, రావల్పిండి
ఫిబ్రవరి 26 - ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్, లాహోర్
ఫిబ్రవరి 27 - పాకిస్తాన్ vs బంగ్లాదేశ్, రావల్పిండి
ఫిబ్రవరి 28 - ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా, లాహోర్
మార్చి 1 – దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్, కరాచీ
మార్చి 2 – న్యూజిలాండ్ vs ఇండియా, దుబాయ్
మార్చి 4 – సెమీఫైనల్ -1, దుబాయ్
మార్చి 5 – సెమీఫైనల్ -2, లాహోర్
మార్చి 9- ఫైనల్ లాహోర్ (భారత్ ఫైనల్‌కి వెళ్తే దుబాయ్‌లో మ్యాచ్ జరగనుంది)
మార్చి 10 - రిజర్వ్ డే

ఇది కూడా చూడండి: Allu arjun: అల్లు అర్జున్ విచారణ పూర్తి.. కీలక ప్రశ్నలకు సమాధానాలివే!

ఇది కూడా చూడండి: AP: ఏపీలో దారుణం.. సిబ్బంది నిర్లక్ష్యానికి గర్భిణి మృతి..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు