Bumrah: మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య నాలుగో టేస్టు జరుగుతోంది.నాలుగో రోజు ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది.మొదటి ఇన్నింగ్స్ లో యువ ఆటగాడు కొన్‌స్టాస్ దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు.మరీ ముఖ్యంగా భారత స్టార్ పేసర్ బుమ్రా బౌలింగ్ లో ఎదురు దాడి చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ వీరి మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుందని అభిమానులు భావించారు. Also Read: ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ విజేతగా కోనేరు హంపి! కానీ సీనియర్ పేసర్ ఎదుట ఆసీస్ కుర్రాడు నిలవలేకపోయాడు.ఇన్నింగ్స్ ఏడో ఓవర్ లో అద్భుతమైన బంతితో కొనస్టాస్ ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు.దీంతో బుమ్రాతో పాటు భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. Also Read: కన్నీళ్లు పెట్టించే నితీష్ రెడ్డి బయోగ్రఫీ.. కొడుకు కోసం ఉద్యోగాన్ని వదులుకున్న తండ్రి భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడుఇంకా అరవాలంటూ కొన్‌స్టాస్ అభిమానులను కోరాడు. అదే తరహాలో కొన్‌స్టాస్ ఔటైనప్పుడు బుమ్రా కూడా అదేరీతిలో సైగ చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Also Read: ఆసీస్ గడ్డపై తెలుగు కుర్రాడి ప్రభంజనం.. టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు! టీమ్ ఇండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ. కానీ మెల్‌బోర్న్ నాలుగో రోజు ఆటలో విరాట్ కోహ్లీ ముందుండి జట్టును నడిపిస్తున్నట్లుంది.బౌలర్లను ప్రోత్సహించడంతో పాటు ఏ విధంగా బంతులేయాలి? ఫీల్డింగ్ సెటప్ వంటి విషయాల్లోనూ సూచనలు ఇస్తూ కనిపించాడు. కెమెరాలు కూడా కోహ్లీనే ఎక్కువగా కవర్ చేయడం విశేషం. మైదానంలో రోహిత్ ఉన్నప్పటికీ..విరాట్ హైలైట్ గా నిలిచాడు. మెల్‌బోర్న్ ప్రేక్షకులు కోహ్లీని అవహేళన చేసిన సంగతి తెలిసిందే. Also Read: పుష్ప స్టైల్లో నితీశ్ రెడ్డి.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే! ఉస్మాన్ ఖవాజాను క్లీన్‌బౌల్డ్ చేసిన తర్వాత సిరాజ్ సైలెంట్ అంటూ సైగలు చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. లబుషేన్ వికెట్ తీసినప్పుడూ అభిమానులను అరవండంటూ ప్రోత్సహించాడు.ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.