BREAKING NEWS : ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు!

ఛాంపియన్స్ ట్రోఫీలో మంగళవారం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. రావల్పిండిలో భారీ వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లుగా అంపైర్లు ప్రకటించారు.  దీంతో  రెండు జట్ల ఖాతాలోకి చెరో పాయింట్ చేరింది.  

New Update
aus vs sa

ఛాంపియన్స్ ట్రోఫీలో మంగళవారం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. రావల్పిండిలో భారీ వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లుగా అంపైర్లు ప్రకటించారు.  దీంతో   రెండు జట్లు ఖాతాలోకి చెరో పాయింట్ చేరింది.  దీంతో గ్రూపు బీలో ఇరు జట్లు చెరో మూడు పాయింట్లతో ఉన్నాయి.  అయితే దక్షిణాఫ్రికా అత్యుత్తమ రన్ రేట్ (NRR): +2.140 కారణంగా గ్రూప్ బీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.  

స్టార్ ఆటగాళ్లు లేకున్నా..  

2023లో వన్డే ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్ వంటి భారీ ఆటగాళ్లు లేని జట్టుతో టోర్నమెంట్‌లోకి అడుగుపెట్టిన ఆస్ట్రేలియా ఇంగ్లండ్ తో జరిగిన తొలిమ్యా్‌చ్ లో 352 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి గ్రాండ్ విక్టరీ కొట్టింది. 

ఇక రేపు ఆఫ్ఘనిస్తాన్,  ఇంగ్లాండ్ జట్ల మధ్య  మ్యాచ్ లాహోర్‌ లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి ఔట్ అవుతుంది.  ఆస్ట్రేలియా తన చివరి గ్రూప్ మ్యాచ్ శుక్రవారం ఆఫ్ఘనిస్తాన్‌తో తలబడుతుంది.  ఇంగ్లాండ్ తన చివరి గ్రూప్ మ్యాచ్ కరాచీలో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. ఇక గ్రూప్ ఏలో భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే సెమీ ఫైనల్ కు అర్హత సాధించాయి.  

Also read :  AP Teacher Jobs: ఏపీలో మెగా డీఎస్సీ.. శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు