ఆస్ట్రేలియా - భారత్ మధ్య బోర్డర్ గావస్కర్ ట్రోఫీ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. తొలి టెస్ట్ భారత్ కైవసం చేసుకోగా.. రెండో టెస్టు ఆసీస్ సొంతం చేసుకుంది. ఇక ఇటీవల మూడో టెస్టు జరిగింది. ఈ టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో నాలుగో టెస్టు కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూశారు. ఆ రోజు రానే వచ్చింది. నిన్న (డిసెంబర్ 26) న ఆసీస్ - భారత్ మధ్య నాలుగో (బాక్సింగ్ డే) టెస్టు ప్రారంభం అయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474 పరుగులు చేసింది. ALSO READ: రేవంత్ రెడ్డి గలీజ్‌గా బిహేవ్ చేస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు! ఇంకో 111 పరుగులు దీంతో భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ మొదట్లోనే కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ 46 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. క్రీజ్‌లో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఉన్నారు. పంత్ 6 రన్స్ నాటౌట్, జడేజా 4 రన్స్ నాటౌట్‌గా నిలిచారు. భారత్ ఇంకా 310 పరుగుల చేయాల్సి ఉంది. అంతేకాకుండా ఫాలో ఆన్ నుంచి బయటపడాలంటే భారత్ ఇంకో 111 పరుగులు చేయాలి. ALSO READ: పాకిస్తాన్‌లో పుట్టి భారత ప్రధానిగా ఎదిగి... ఇదిలా ఉంటే భారత్ నుంచి ఓపెనర్స్‌గా రోహిత్, యశస్వీ జైశ్వాల్ దిగారు. ఆరభంలోనే రోహిత్ (3) ఔటయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్ మాత్రం నిలకడగా ఆడాడు. ఆపై కేఎల్ రాహుల్ (24) పరుగులకు వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్ నష్టానికి జైశ్వాల్ - రాహుల్ కలిసి 43 పరుగులు జోడించారు. ఆపై విరాట్ క్రీజ్‌లోకి వచ్చాడు. వీరిద్దరూ ఆసీస్ బౌలింగ్‌ను చిత్తు చేశారు. ALSO READ: విశిష్ట వ్యక్తిని కోల్పోయాం..ప్రధానితో సహా ప్రముఖుల సంతాపం దాదాపు సెంచరీ భాగస్వామ్యం కుదిర్చారు. అదే సమయంలో జైస్వాల్ తన కెరీర్‌లో 9వ అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అనంతరం జైస్వాల్ రన్‌ఔట్ అయ్యాడు. అనంతరం కోహ్లీ(36) అయినా నిలకడగా ఆడుతాడు అని అనుకునే సమయానికి ఔటయ్యాడు. ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు? తన బలహీనతకే పెవలియన్ బాట పట్టాడు. ఆఫ్‌సైడ్ బంతిని ఆడి చాలా సార్లు ఐటయ్యాడు. ఇప్పుడు కూడా అదే బంతికి వెనుదిరిగాడు. ఆకాశ్ దీప్ (0) 2 ఓవర్లు క్రీజ్‌లో ఉన్నా రన్స్ మాత్రం సాధించలేదు. దీంతో టీమిండియా ఇప్పటికి 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మూడో రోజు తొలి సెషన్ భారత్‌కు అత్యంత కీలకం కానుంది.