బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరి టెస్ట్ సిడ్నీలో జరుగుతోంది. ఈ మ్యాచ్ మంచి రసపట్టులో ఉంది. బుమ్రా ఆట మధ్యలోనే వెళ్ళిపోయాడు. అయినా భారత బౌలర్లు ఎక్కడా తగ్గకుండా ఆసీస్‌ను కట్టడి చేయగలిగారు. మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు ఆధిక్యం సాధించారు. దాని తరువాత టీమ్ ఇండియా నిన్న తన రెండో ఇన్నింగ్స్ ఆడింది. ఇందులో రిషబ్ పంత్ 61 పరుగుల సంచలన ఇన్నింగ్స్ చేశాడు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా పరుగులు చేయలేకపోయారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 157 పరుగులు చేసి...162 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌కు ఇచ్చింది. ఈరోజు ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. Also Read: AP: డాకూ మహరాజ్ టికెట్ల పెంపుకు అనుమతి ఆసీస్ రెండో ఇన్నింగ్స్... నాల్గవరోజు ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది. ఈరోజు ఆసీస్ మొదటి నుంచే దూకుడుగా ఆడటం మొదలుపెట్టింది. ఈరోజు కూడా భారత కెప్టెన్ బుమ్రా, ప్రధాన బౌలర్ బుమ్రా ఆడటం లేదు. కానీ భారత బౌలర్లు మ్యాచ్‌ను ఈజీగా వదిలేయదలుచుకోలేదు. మరోవైపు ఆసీస్ బ్యాటర్లు కూడా పట్టుదలగా ఆడుతున్నారు. ఓపెనర్లు కొన్‌స్టాస్, మార్స్ లబుషేన్ దూఉడుగా మొదలుపెట్టారు. మొదటి ఓవర్‌లోనే 13 పరుగులు రాబట్టారు. 39 పరుగుల వరకు వికెట్ కోల్పోకుండా ఆడారు. కానీ పరుగుల దగ్గర ఆసీస్ మొదట వికెట్ కోల్పోయింది. 22 పరుగుల దగ్గర కొన్‌స్టాస్ ప్రసిధ్ బౌలింగ్లో ఆవుట్ అయ్యాడు. తరువాత 22 పరుగుల దగ్గర లబుషేన్ ను కూడా ప్రసిధ్ అవుట్ చేశాడు. ఆ తరువాత ఇప్పుడే కొంతసేటి క్రితం 58 పరుగుల దగ్గర స్టీవ్ స్మిత్ ను కూడా ప్రసిధ్ అవుట్ చేశాడు. స్లిప్‌లో ఉన్న యశస్వికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. భాత బౌలర్లు ఇలానే బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్తుంది. భారత్ విజయం సాధిస్తే.. రేసులో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. Also Read: TS: గ్రామ సభల్లో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ