/rtv/media/media_files/2025/01/29/Jqm67rVAhkX3kALLxJPG.jpg)
Warangal pak links Photograph: (Warangal pak links)
వరంగల్లో ఉగ్రవాదులు కదలికలు కలకలం రేపుతున్నాయి. నగరానికి చెందిన ఓ వ్యక్తికి పాక్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వరంగల్ జానిపీరీలకు చెందిన జక్రియా అనే వ్యక్తిని ఇటీవల చెన్నై ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. జక్రియా స్వస్థలం వరంగల్ జానిపీరీలు. ఇతను గతికొద్దికాలంగా శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద బిర్యానీ సెంటర్ నడుపుతూ జీవనం కొనసాగిస్తు్న్నాడు. ఇతనికి పాక్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లుగా అనుమానించిన పోలీసులు 2025 జనవరి 25వ తేదీన శ్రీలంకకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు.
జక్రియా అసలు స్వస్థలం పాకిస్తాన్.. 32 సంవత్సరాల క్రితం ఇండియాకు వచ్చి గుంటూరులో స్థిరపడ్డారు. 25 సంవత్సరాల క్రితం వరంగల్ కు వచ్చి జానిపీరీలో స్థిరపడ్డారు. ఇక్కడ రాయల్ బావర్చి బిర్యాని పాయింట్ ఏర్పాటు చేసి జీవనం కొనసాగిస్తున్నారు. జనవరి 25న ఖలీఫా ఎన్నిక కోసం శ్రీలంకకు వెళ్తుండగా.. మద్రాస్ ఎయిర్ పోర్టులోఅరెస్ట్ చేశారు. అతనిని పోలీసుల బృందం విచారిస్తోంది. నిజంగానే అతనికి ఉగ్రవాదులతో సంబంధం ఉందా లేక కేవలం అనుమానమేనా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. వరంగల్లో ఉగ్రవాదులు కదలికలు ఉన్నాయని పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడంతో స్థానికంగా ప్రజలు భయాందళోనలకు గురవుతన్నారు. పోలీసులు కూడా అలెర్ట్ అయి నిఘాను మరింతగా పెంచారు.
దిల్ సుఖ్ నగర్ పేలుళ్లు
ఉమ్మడి ఏపీలో 2013లో దిల్ సుఖ్ నగర్ లో జరిగిన వరుస బాంబు పేలుళ్లు హైదరాబాద్ నగరాన్ని ఒక్కసారిగా వణికించాయి. వరుస బాంబుపేలుళ్లతో ఏకంగా 17 మంది మృతి చెందారు. చాలామంది గాయపడ్దారు. ఇప్పటికీ ఈ ఘటన హైదరాబాద్ వాసుల్నీ వెంటాడుతూనే ఉంటుంది. అది సృష్టించిన విధ్వంసం అలాంటిది మరి. ఈ ఘటనపై నేషనల్ ఇన్వెస్టిగేష్ ఏజెన్సీ దర్యాప్తు చేసి ఇండియన్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ యాసిన్ భత్కల్ సహా ఐదుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసింది. వీరికి 2016లో ఉరిశిక్ష పడింది.