ఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమి..! BJP విజయానికి దారితీసేవి ఈ 6 అంశాలే..

ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ BJPయే అధికారంలోకి రాబోతుందని చెబుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల్లో ఓటమి పరిస్థిలు ఎందుకు వచ్చాయి. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ చేసిన మ్యాజిక్, ఆప్‌ ఈ పరిస్థితికి కారణమైన 6 అంశాల కోసం ఆర్టికల్ పూర్తిగా చదవండి.

author-image
By K Mohan
New Update
Arvind Kejriwal and PM Modi

Arvind Kejriwal and PM Modi

ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేని ఓ వ్యక్తి చీపురు పట్టుకొని వచ్చి ఢిల్లీ రాజ కీయాల్లో చరిత్ర సృష్టించాడు.ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో అతనో సాధారణ ఉద్యోగి. సడెన్‌గా ఉద్యోగానికి రాజీనామా చేసి 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టాడు. పార్టీ స్థాపించిన సంవత్సరానికే సీఎం సీటుపై అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. దాదాపు 12ఏళ్లుగా ఢీల్లీ పీఠం కేజ్రీవాల్‌ పార్టీదే. 2025 ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఢిల్లీలో అధికారం చేపట్టబోయేది బీజేపీనే అని క్లియర్ కట్‌గా చెబుతున్నాయి. ఒకటి రెండూ పోల్స్ తప్ప అందరూ BJPదే ఢిల్లీ అని ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేశారు. జీరో నుంచి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ పాలిటిక్స్‌లో హీరో అయ్యాడు. ఇప్పుడు మళ్లీ అదే జీరో స్థాయికి వెళ్లనున్నాడా? అసలు ఢిల్లీలో బీజేపీ పగ్గాలు చేపట్టడానికి కలిసిరానున్న అంశాలు ఏంటి? ఢిల్లీ ఎన్నికల్లో మోదీ మ్యాజిక్ ఏంటి? కేంద్రం కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసిందా? ఆమ్ ఆద్మీపై ఎందుకింత వ్యతిరేకత వచ్చిందో ఇప్పుడు చూద్దాం..

మొత్తం సీట్లు 70.. మ్యాజిక్ ఫిగర్ 36. ఈ లెక్కల్లో కేవలం కేజ్రీవాల్, మోదీ మధ్యనే పోటీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంతంత మాత్రమే పెర్మామెన్స్. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 62 సీట్లు గెలుచుకున్న ఆప్ ఇప్పుడు దాదాపు 20కే పరిమితం అవుతుందని అంటున్నారు. 27 సంవత్సరాల తర్వాత మళ్లీ ఢిల్లీలో బీజేపీ హవా మొదలైంది. ఐదు ఎగ్జిట్ పోల్స్ పోల్ ప్రకారం బిజెపి 39 సీట్లు గెలుచుకుంటుందని, ఆప్ 30 స్థానాలకు పడిపోయిందని తెలుస్తోంది. 2013కి ముందు ఢిల్లీలో వరుసగా 4 టర్మ్‌లు కాంగ్రెస్‌దే అధికారం. కానీ ఇప్పుడు ఒకటి, రెండు సీట్లుకు పడిపోయింది.

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్

పీపుల్స్ పల్స్: బిజెపి 51 నుండి 60 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఆప్ 10 నుండి 19 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేసింది.
పీ మార్క్ : బిజెపికి 39–49 సీట్లు వస్తాయని అంచనా వేయగా, టైమ్స్ నౌ జెవిసి దానికి 39–45 సీట్లు వస్తాయని అంచనా వేసింది.మాట్రిజ్ 35 నుండి 40 సీట్లు ఇస్తుందని అంచనా వేసింది.
AAPకు PMarq 21 నుంచి 31 సీట్లు వస్తాయని అంచనా వేయగా, టైమ్స్ నౌ JVC 22 నుంచి 31 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మ్యాట్రిజ్ ప్రకారం, AAP 32–37 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేసింది.

కేజ్రీవాల్ ఫెయిలైన 6 పాయింట్స్ ఇవే..

మాట తప్పిన అరవింద్ ఆప్:

ఢిల్లీలో అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి పుట్టుకొచ్చిన పార్టీనే ఆప్. ఇప్పుడు అదే పార్టీ అధినేతపైనే అవినీతిపరుడు అని మచ్చ ఉంది. ఆప్‌కు బాగా దెబ్బ కొట్టింది  ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఢిల్లీ ప్రజలు ఆప్‌ను కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా భావించారు. మ్యానిఫెస్టో ఫ్రీ కరెంట్, తాగు నీరు వంటి హామీలు ఇచ్చింది ఆప్. 2020లో విజయం తర్వాత మహిళలకు ఫ్రీ బస్సు ప్రవేశపెట్టింది. ఉచితాలు తప్ప, ఢిల్లీలో పెద్దగా అభివృద్ధి పనులు లేవు. 2015లో నగరంలోని అన్ని ప్రాంతాలకు పైపుల ద్వారా నీటి కనెక్షన్లు అందిస్తామని AAP హామీ ఇచ్చింది. కానీ నేటికీ అది నెరవేరలేదు.

అంతేకాదు ఢిల్లీ ప్రధాన సమస్య కాలుష్యం.. 2020 మ్యానిఫెస్టోలో ఢిల్లీలో కాలుష్యాన్ని 60% తగ్గిస్తామని హామీ ఇచ్చింది. కానీ 2025 ఆఫ్ మ్యానిఫెస్టోలో కాలుష్యం గురించే ప్రస్తవన లేదు. ఢిల్లీ పొల్యుషన్ మాత్రం అంతకంతా పెరిగిపోయింది. అలాగే కేజ్రీవాల్ ఫొకస్ చేసిన విద్యా, వైద్యం వ్యవస్థల్లో అక్రమాలు జరిగాయని జేపీపీ నాయకులు ఆరోపించారు. ఢిల్లీ పాఠశాలలు మరియు మొహల్లా క్లినిక్‌లను తన విజయాలుగా చూపించింది. కానీ బిజెపి ఆ రెండు వాదనలను తిప్పికొట్టింది. మొహల్లా క్లినిక్‌లు పనిచేయడం లేదని అక్కడి ఆర్థిక మోసాలను బీజేపీ హైలెట్ చేసింది.

ఢిల్లీలో స్కూల్స్ ఓ రేంజ్‌లో తీర్చిదుద్దుతామని ఫస్ట్ మ్యానిఫెస్టోలో ఆప్ పేర్కొంది. రిజల్ట్స్ కోసం విద్యార్థులను ప్రీ-బోర్డ్ కాసుల్లో నిర్బంధించారని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తానని హామీ ఇచ్చారు. 6 సంవత్సరాల తరువాత, అది నిరవేరక పోగా ఉన్న ఢిల్లీ అధికారాలు కుదించబ్డడాయి. ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్‌లో కీలక అంశాలు కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్‌తో చేతిలోకి వెళ్లాయి. 

రాజకీయాల్లో యమునా నది..

కేజ్రీవాల్ పలు మీడియా సమావేశాల్లో పదే పదే చెప్పిన అంశం యమునా నది శుద్ధి. 2015 ఎన్నికల మ్యానిఫెస్టో సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ జ్ఞాపకాలలో యమునా కీలకం. కానీ ఈ జీవనాడి చనిపోతోందని అన్నారు. ఢిల్లీ మురుగునీటిని 100% సేకరించి శుద్ధి చేస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. 12ఏళ్లు అవుతున్నా.. యమునా నదిలో కలుషితం పెరిగిందే తప్పా తగ్గలేదు. యమున నదిపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు సెల్ఫ్‌గోల్‌గా మారాయి. అక్కడున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడదామని కేజ్రీవాల్ చేసిన వాఖ్యలు సొంతపార్టీని దెబ్బతీశాయి. 2025 ఎలక్షన్ల ముందు ఆప్ గవర్నమెంట్‌ ఢిల్లీలో కొన్నిరోజులు నీటి సప్లైను నిలిపివేసింది. దానికి వివరణగా హర్యాణా ప్రభుత్వం యమునా నదిని విషపూరితం చేసిందని.. అందుకే వాటర్ సప్లై ఆపివేయాల్సి వచ్చిందని కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. దీనికి కౌంటర్ అటాక్‌గా హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ యమునా నదిలో నీళ్లు తాగాడు.

AAPకు అరవింద్ కేజ్రీవాల్ బ్రాండ్ గయా..

ఆమ్ ఆద్మీ పార్టీ అంటే కేజ్రీవాల్.. కేజ్రీవాల్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అన్నటుగా ఉండేది. ప్రాంతీయ పార్టీగా అవతరించిన ఆప్ పంజాబ్‌లో అధికారంలోకి రావడం.. తర్వాత ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం చూపడం.. బీజేపీకి నచ్చలేదు. భవిష్యత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పడైనా తమకు ప్రమాదమనే భావించింది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ బ్రాండ్ ఎవరూ చూసి.. లిక్కర్ స్కాం మచ్చ వేసి కేజ్రీవాల్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసింది. ఆప్‌లో కీలక వ్యక్తులైన మనీష్ సిసోడియా, సత్రేంద్ర జైన్, సంజయ్ సింగ్ లాంటి బడా నాయకులకు అవినీతి మరకలు అంటించి అరెస్ట్ చేశారు. ఎలక్షన్లకు కొన్నిరోజుల ముందు జైలు నుంచి బయటకు వచ్చినా.. ప్రచారంలో తిరిగి పార్టీ తరుపు మాట్లాడలేకపోయారు.

పొలిటికల్ లీడర్‌లా కాకుండా సామాన్య వేషధరణలో కనిపించే అరవింద్ కేజ్రీవాల్ సిప్లీ సిటీకి మారుపేరు. అలాంటి వ్యక్తి పదేళ్ల తర్వాత విలాసవంతమైన మహల్, వ్యాగనర్ కారు వాడుతున్నాడని అపవాద ప్రజల్లో వచ్చింది. ఆప్‌ను ఖతం చేయడానికి కేజ్రీవాల్‌ను టార్గెట్‌గా వాడుకొన్నారు బీజేపీ లీడర్లు. శీష్‌మహల్‌‌లో ఉంటారు. రాయల్టీ కోసం కోట్ల ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తు్న్నారని బీజేపీ బాగా ప్రచారం చేసింది. దీంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అలాగే లిక్కర్ స్కామ్ వల్ల అరవింద్ కేజ్రీవాల్‌పై వచ్చిన వ్యతిరేకత పార్టీపై పడవద్దని అసెంబ్లీ ఎన్నికలకు కొన్నినెలల ముందు సీఎంగా రాజీనామ చేసి అతిశీని ముఖ్యమంత్రిగా ప్రకటించారు. అయినా అది వర్క్‌అవుట్ కాలే. కేజ్రీవాల్ బ్రాండ్ ఇమేజ్ తగ్గించడంలో బీజేపీ లీడర్లు పట్టువదలకుండా ప్రయత్నించారు. ఆ విషయంలో విజయం సాధించింది బీజేపీ.

మోదీ బడ్జెట్‌లో మిడిల్ క్లాస్‌ మ్యాజిక్..

దేశరాజధానిలో ఎక్కువగా ప్రభుత్వం ఉద్యోగులు ఉంటారు. ఢిల్లీ జనాభాలో 67శాతం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఆ పాయింట్‌ను క్యాచ్ చేసింది సెంట్రల్‌లో బీజేపీ. 2025 బడ్జెట్ ప్రవేశపెట్టేది ఫిబ్రవరి1, ఢిల్లీ ఎలక్షన్లు ఫిబ్రవరి 5, ఫలితాలు ఫిబ్రవరి 8 ఈ మూడు తేదీలు బాగా గుర్తుపెట్టుకోంది కేంద్ర ప్రభుత్వం. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2025తో అటు మిడిల్ క్లాస్, ఇటు గవర్నమెంట్ ఎంప్లాయిస్‌ మనసులు గెలుచుకుంది. ఇన్‌కమ్ ట్యాక్స్‌ రూ.12 లక్షల వరకు మినహాయించి దేశవ్యా్ప్తంగా మధ్యతరగతి కుటుంబాలకు దగ్గరైంది. అంతేకాదు జనవరి 16న 8వ వేతన సంఘం ప్రకటించింది. ఇలా ఎన్నికలను దృ‌ష్టిలో పెట్టుకొని బీజేపీ వ్యవహరించింది. బిజెపి ప్లాన్ వర్క్‌ఔవుట్ అయిందనే చెప్పవచ్చు. ఎలక్షన్లకు కొద్ది రోజుల ముందు నుంచి శీష్మహల్, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు, ఆప్ పార్టీ రూలింగ్‌పై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లారు బీజేపీ నాయకులు.

కేజ్రీవాల్ పార్టీకి పదేళ్ల అవకాశం చాలు..

ఢిల్లీలో అక్ష్యరాస్యత రేటు దాదాపు 90 శాతం. ఇండియా క్యాపిటల్ కావడంతో ఉద్యోగ, వ్యాపారరీత్య అక్కడికి వచ్చిన మేధావుల సంఖ్య ఎక్కువే. ఢిల్లీ ప్రజలు హైలీ ఎడ్యుకేటెడై ఉంటారు. ఆమ్ ఆద్మీ పార్టీకి పదేళ్లపాటు అధికారం ఇచ్చినా ఏం అభివృద్ధి జరగలేదని అనుకొని ఉంటారు. కొత్తక వింత.. పాతకొ రోత అనే సామెత వినే ఉంటారు. ఎంత చేసినా ప్రజల్లో ఎంతో కొంత అంసతృ‌ప్తి ఉంటూనే ఉంటుంది. గత పదేళ్లలో ఆప్ కొత్తదనం తగ్గిపోయిందని అధికారాన్ని మార్చాలని భావిస్తుంటారు. దేశమంతా బీజేపీ హవా నడుస్తోండటంతో ఢిల్లీవాసులు కూడా మార్పు కోసం ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన పదేళ్లు అవకాశం చాలనే ఆలోచనలో ఢిల్లీ ప్రజలు ఉండి ఉంటారు.

బీజేపీ వ్యతిరేక ఓటర్లలో కన్ఫ్యూజన్.. ఓట్ల చీలిక

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇప్పుడు విడిపోయాయి. కొన్ని నెలల తర్వాత జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. బీజేపీ వ్యతిరేక ఓటర్లు ఎవరికి ఓటేయ్యాలి..? అనే కన్ఫ్యూజన్ ఢిల్లీ ప్రజల్లో ఉంటుంది. ఢిల్లీ 70 స్థానాల్లోనూ ఆప్, కాంగ్రెస్ 2 పార్టీల అభ్యర్థులను నిలబెట్టారు. దీంతో BJP వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది.

మాయావతి BSP అన్నీ నియోజకవర్గాల్లో పోటీ చేసింది. దీంతో రిజర్డ్వ్ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ప్రభావం చూపే అవకాశం ఉంది. అసదుద్దీన్ ఒవైసీ AIMIM పార్టీ ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో AAP ఓట్ షేర్ తగ్గించగలదు. మహారాష్ట్రలో కీలకమైన BJP మిత్రపక్షమైన అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) దాదాపు 30 స్థానాల్లో పోటీ చేసింది. అంతేకాదు ఆజాద్ సమాజ్ పార్టీ కూడా బరిలోకి దిగింది. ఇన్ని పార్టీతో ఢిల్లీ ప్రజల ఓట్లు చీలే అవకాశం ఎక్కువ ఉంది. ఇది ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలకే కాదు అన్నీ చిన్న పార్టీలకు దెబ్బే.

పోటీలో ఉన్న పార్టీలు ఉన్నా.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ప్రధాన పోరు బీజేపీ, ఆప్‌కు మధ్యనే ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ, బీజేపీ వ్యతిరేక ఓట్లు ఇన్ని రాజకీయ పార్టీలకు వెళ్తే ఏం జరిగేది ఎవరూ ఊహించలేదు. అందుకే ఢిల్లీలో ఎన్నికల వాతావరణం మరింత ఆసక్తిగా, అనూహ్యంగా మారింది. ఢిల్లీ ప్రజలు ఎటు మొగ్గుచూపుతారో ఫిబ్రవరి 8న చూడాలి. ఢిల్లీకా బాద్‌షా ఎవరో ఆ రోజు తెలిపోతుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు