TG Crime : అన్నదమ్ములు అంటే ఎంతో ఆప్యాయంగా ఉండాలి. ఈ మధ్యకాలంలో అన్నదమ్ములపై కుటుంబాల పరిస్థితుల ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఒక తల్లి కడుపున పుట్టి.. చిన్నప్పుడు నుంచి ఒకే కుటుంబంలో పెరిగి.. చిన్నచిన్న విషయాలకే పెద్ద రచ్చ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అనుబంధాల మధ్య జీవితాన్ని తీర్చిదిద్దాల్సిన అన్నదమ్ములు కసాయి వాళ్లగా మారుతున్నారు. తాజాగా తెలంగాణలో అలాంటి ఘోర ఘటన ఒకటి జరిగింది. అన్నపై తమ్ముడి ఏకంగా.. పెట్రోల్ పోసి.. నిప్పంటించాడు.ఈ ఘాతుకం ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతోంది.
Also Read : అస్సాం బొగ్గు గని ప్రమాదం.. ముగ్గురు మృతి
పెట్రోల్ పోసి..
ఖమ్మం నగరం నిజాంపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు తమ్ముడు. అంటుకున్న మంటలతో ఆర్తనాదాలు పెట్టిన అన్నయ్య గమనించిన మరో సోదరుడు మంటలు ఆర్పేందుకు యత్నించాడు. గాయపడి తీవ్ర గాయలతో ఉన్న అన్న స్టాలిన్ చిన్న తమ్ముడు హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం ప్రమాదంపై బాధితుడి స్టాలిన్, తమ్ముళ్లను విచారించారు.
ఇది కూడా చదవండి: మధుమేహంతో ఇబ్బందిగా ఉందా.. ఈ ఆకులు తింటే మీ వ్యాధి పరార్
స్థానిక వివరాల ప్రకారం.. నిజాంపేటలోని సొంతిట్లో ముగ్గురు అన్నదమ్ములు స్టాలిన్, రాజ్ కుమార్, భాను ప్రసాద్ నివాసముంటున్నారు. వీరి తల్లిదండ్రులు కోవిడ్‌తో మరణించారు. స్టాలిన్ మద్యం సేవించి తరచూ తనతో గొడవపడుతున్నాడని చిన్న తమ్ముడు భానుప్రసాద్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అన్న ఆర్తనాదాలు విని మంటలార్పేందుకు మరో తమ్ముడు రాజ్ కుమార్ యత్నించాడు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో స్టాలిన్ స్టాలిన్ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులకు రాజ్ కుమార్ ఫిర్యాదు చేశాడు. తమ్ముడు ఫిర్యాదు మేరకు భానుప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు ఖమ్మం వన్ టౌన్ పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: చదివింది గుర్తుండటం లేదా.. ఈ సింపుల్ చిట్కాలతో టాపర్ మీరే
Also Read : నేపాల్ భూకంపానికి చైనా ప్రాజెక్టులే కారణం..!