Tollywood : టాలీవుడ్ లో విషాదం..ప్రముఖ నిర్మాత మృతి.!

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత పొలిశెట్టి రాంబాబు మరణించారు. ఆయన వయస్సు 58సంవత్సరాలు. ఆయన కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. శనివారం సాయంత్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

New Update
Tollywood : టాలీవుడ్ లో విషాదం..ప్రముఖ నిర్మాత మృతి.!

Tollywood :మిర్యాలగూడ పట్టణానికి చెందిన పొలిశెట్టి రాంబాబు మొదట ప్రజానాట్యమండలి కళాకారుడిగా పనిచేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అల్లరి నరేశ్ తో గోపి గోడమీద పిల్లి, లక్ష్మీపుత్రుడు వంటి సినిమాలు తీశారు. ఆయన గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈమధ్యే హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఐదురోజులపాటు వెంటిలేటర్ పై ఉన్నారు.

పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో అమెరికాలో ఉంటున్న తన చిన్న కుమార్తె శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకుంది. అయితే అదే రోజు మధ్యాహ్నం వెంటిలేటర్ ను తొలగించారు. కొనఊపిరితో ఉన్న ఆయనను మరో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 8గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

ఇది కూడా చదవండి: తన ప్రేయసిని పెళ్లాడిన డేవిడ్ మిల్లర్. !

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు