/rtv/media/media_files/2026/03/16/school-1-2026-03-16-10-49-18.jpg)
వెస్ట్ బెంగాల్(west bengal) లోని ఒక స్కూల్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కోల్‌కతాలోని జీవన్ జ్యోతి మోడల్ స్కూల్ లో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో కొంతమంది అమ్మాయిలు తమ ఒంటికి తువ్వాళ్లు చుట్టుకుని డ్యాన్స్(Towel Dance) చేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది. స్టేజ్ వెనుక ఉన్న బ్యానర్‌పై స్కూల్ పేరు స్పష్టంగా ఉండటం, చిన్న పిల్లలు ఆ డ్యాన్స్‌ను చూస్తుండటంతో ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
చదువు నేర్పించే స్కూల్లో, అది కూడా అందరూ విద్యార్థులు ఉన్న సమయంలో ఇలాంటి ప్రదర్శనలు ఎలా చేస్తారని ఆశ్చర్యపోతున్నారు. స్కూల్ అంటే పిల్లలకు మంచి విలువలు, క్రమశిక్షణ నేర్పే చోట ఉండాలని, కానీ ఇలాంటి డ్యాన్సులు ఏంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
Also Read : ఫామ్‌హౌస్ కేసు నుంచి డ్రగ్స్ కేసు వరకు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా పైలట్ !
కచ్చితంగా చర్యలు తీసుకోవాలని
ఈ వైరల్ వీడియో(viral video telugu) పై ప్రజలు చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. స్కూల్ వాతావరణంలో ఇలాంటివి అస్సలు బాలేవని, దీనికి బాధ్యులైన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. అసలు ఆ డ్యాన్స్ జరుగుతున్నప్పుడు ఎవరూ ఎందుకు ఆపలేదు? స్కూల్ యాజమాన్యం ఇలాంటి వాటికి ఎలా పర్మిషన్ ఇచ్చింది? అని మండిపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే, అందరూ తిట్టుకుంటుంటే కొందరు మాత్రం దీనిపై వేరేలా స్పందిస్తున్నారు. కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో ఇలాంటి డ్యాన్సులు మామూలే కదా అని అంటున్నారు. మనం రోజు టీవీల్లో, సినిమాల్లో ఇలాంటివి చూడటం లేదా? అలాంటప్పుడు కేవలం విద్యార్థులను మాత్రమే తప్పు పట్టడం సరికాదు అని వీరు వాదిస్తున్నారు.
అయితే ఇంత జరుగుతున్నప్పటికీ జీవన్ జ్యోతి మోడల్ స్కూల్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. అసలు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు జరిగింది? దీనిపై విచారణ ఏమైనా మొదలైందా? అనే విషయాలు కూడా ఇంకా స్పష్టంగా తెలియలేదు. మొత్తానికి ఒక చిన్న వీడియో సోషల్ మీడియాలో ఎంత పెద్ద రచ్చ చేస్తుందో అనడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ.
Also Read : టోల్ బాదుడు షురూ.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు.. NHAI కీలక ప్రకటన!
Follow Us