Iranian oil: యుద్ధం కొనసాగుతున్న వేళ బిగ్‌ ట్విస్ట్‌.. ఇరాన్‌ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్‌ చమురుపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఆ చమురు అమ్మకాలకు సంబంధించి 30 రోజుల మినహాయింపును జారీ చేసింది.

New Update
US grants 30-day waiver for Iranian oil sales to ease global supply crunch

US grants 30-day waiver for Iranian oil sales to ease global supply crunch

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్‌ చమురుపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఆ చమురు అమ్మకాలకు సంబంధించి 30 రోజుల మినహాయింపును జారీ చేసింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెసెంట్ ఈ విషయాన్ని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సరఫరాకు పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 

Also Read: DGCA కీలక నిర్ణయం.. 11 దేశాల మీదుగా విమానాల రాకపోకలపై బంద్

ఈ తాత్కాలిక చర్యల తీసుకోవడం వల్ల 14 కోట్ల బ్యారెళ్ల ఇరాన్‌ చమురు ప్రపంచ మార్కెట్‌లోకి వస్తుందని తెలిపారు. సముద్రంలో ఇప్పటికే ఆగిపోయిన ఇరాన్‌ చమురును విక్రయించేందుకు మాత్రమే పర్మిషన్లు వస్తాయని పేర్కొన్నారు. అమెరికా మినహాయింపులపై కూడా ఇరాన్‌ కూడా స్పందించింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లకు చమురు సరఫరా చేసేందుకు తమ వద్ద అదనపు ముడి చమురు లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఇరాన్ ఇంధన మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎక్స్‌లో పోస్టు చేశారు. చమురు సరఫరాపై వస్తున్న ఆందోళనలు తగ్గించడం కోసమే అమెరికా ఈ ప్రకటన చేసినట్లు పేర్కొన్నారు.  

Also Read: TMC మేనిఫెస్టో ప్రకటించిన దీదీ.. మమతా బెనర్జీ పది పథకాల హామీలు

Advertisment
తాజా కథనాలు