ప్రయాగ్ రాజ్‌లో మరి కొన్ని రోజుల్లో మహాకుంభమేళా జరగనుంది. ఈ మేళా ఏర్పాట్లలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బిజీగా ఉంది. 12 ఏళ్ళ తర్వాత నిర్వహిస్తున్న కుంభమేళా కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దాంతో పాటూ కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తుంది. కుంభమేళాలకు సాధారణంగా భక్తులు పోటెత్తుతారు. దేశం నలుమూలల నుంచి జనం తరలి వస్తారు. ఈ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీటిని అరికట్టడానికి యూపీ ప్రభుత్వం అండర్ వాటర్ డ్రోన్లను వినియోగించాలని అనుకుంటోంది. వీటిని మొదటిసారిగా పరీక్షించాం. ఇది నీటి అడుగు ఉన్న ఏ వస్తువును అయినా గుర్తించగలదు. ఎవరైనా నీళ్లలో మునిగిపోతే వెంటనే డైవర్ల సాయంతో ఆ ప్రాంతానికి చేరుకోవడానికి వీలు కలుగుతుంది అని కుంభమేళాను పర్యవేక్షిస్తున్న అధికారులు చెప్పారు. వచ్చే ఏడాది... ఇక రయాగ్‌రాజ్ మహా కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ప్రతి 12 సంవత్సరాలకు నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది యాత్రికులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకోనున్నారు. ఈసారి దాదాపు 45కోట్ల మంది యాత్రికులు, సాధువులు, సన్యాసులు, పర్యాటకులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనిని స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, సురక్షిత, డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు యూపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే మేళా కోసం ప్రత్యేక రవాణా ఏర్పాట్లను చేశారు. పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్ళు కూడా నడవనున్నాయి. అలాగే మేళా జరిగే స్థలానికి ఈజీగా చేరుకునేల బస్సులు, ఇతర వాహనాలను ఏర్పాటు చేస్తున్నామని యూపీ ప్రభుత్వం చెప్పింది. గతంలో కంటే ఈ సారి కుంభమేళా అద్భుతంగా జరుగుతుందని యూపీ జల్ శక్తి మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ చెప్పారు. ఇది కూడా చదవండి: BIG BREAKING: టీటీడీలో రూ.300 కోట్ల కుంభకోణం!