11 లక్షల 70 వేలమంది బడి మానేశారు..ఎక్కువగా ఎక్కడ అంటే?

ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 11 లక్షల 70 వేల మంది పిల్లలు స్కూలు మానేశారని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి లెక్కలతో సహా సమాధానం చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా పిల్లలు బడి మానేస్తున్నారు.

New Update
11

దేశంలో అనేక కారణాల వల్ల పిల్లలు స్కూళ్ళకు వెళ్ళడం లేదు. ఇంతకు ముందు వెళ్ళిన వారుకూడా ఇప్పుడు మానేస్తున్నారు. అలా ఈ ఏడాది ఏకంగా 11 లక్షల 70 వేల మంది పిల్లలు బడి మానేశారని చెబుతోంది కేంద్ర విద్యాశాఖ. బడి బయట ఉన్న విద్యార్థుల్లో అత్యధికంగా  ఉత్తరప్రదేశ్‌లో 7.84 లక్షల మంది ఉన్నారు. తర్వాతి స్థానాల్లో జార్ఖండ్ 65 వేల మంది, అస్సాం లో 63వేల మంది ఉన్నారని తెలిపారు. అతి తక్కువ సంఖ్యలో అండమాన్ నికోబార్ దీవులులో కేవలం ఇద్దరు, పుదుచ్ఛేరిలో నలుగురు  మాత్రమే బడి మానేశారని చెప్పారు. సిక్కీంలో 74 మంది,  లడఖ్ , లక్షద్వీప్‌లతో సహా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్కరు కూడా డ్రాప్ ఔట్ కాలేదన్నారు. 

లెక్కలేని పిల్లలు మరెంతమందో..

ఈ లెక్కలు కేంద్ర విద్యాశాఖ పోర్టల్ ప్రకారం మాత్రమే. వీటికి అందని విద్యార్థులు మరెంతో మంది ఉన్నారు. తల్లిదండ్రులు చదివించలేక కొందరు, స్కూళ్ళు సరిగ్గా లేక మరికొందరు, చెడు అలవాట్లకు మరిగి చాలా మంది, చదువు మీద సరైన అవగాహన లేక విద్యార్ధులు స్కూల్ డ్రాపౌట్లుగా మిగులుతున్నారు. వీరి కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా ఫలితం కనిపించడం లేదు.  విద్యావిధానం కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చుబెడుతోంది కానీ విద్యార్థులను బడికి మాత్రం పంపించేలా చేయలేకపోతోంది. 

Also Read: AP: రూ. 8,821 కోట్లతో రాజధానిలో పనులు–మంత్రి నారాయణ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు