రైల్వే సర్వీసులను మరింత మెరుగుపరిచేందుకు దక్షిణ మధ్య రైల్వే ఎప్పటికప్పుడు కొత్త కొత్త సేవలను అందిస్తూ ఉంటుంది. ట్రైన్ జర్నీ చేసే ప్రయాణికుల కోసం సౌకర్యవంతమైన సేవలు ప్రారంభిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా పలు ట్రైన్ సమయాల్లో మార్పులు చేసింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే పలు రైళ్ల సమయాలు మారనున్నాయి. Also Read: 'గేమ్ ఛేంజర్' సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే? జనవరి 1 నుంచి అమలు ఈ మార్పులు అన్నీ 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన రిలీజ్ చేసింది. అందులో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సమయాల్లో మార్పులు జరిగాయి. ఇది విజయవాడ నుంచి వైజాగ్ వరకు ప్రయాణిస్తుంది. విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లే ప్రయాణికులతో ఈ ట్రైన్ ఎప్పుడూ కిటకిటలాడుతుంది. ఇప్పుడు ఈ ట్రైన్ సమయాల్లో మార్పులు చేశారు. ఇది వరకు ఈ ట్రైన్ విజయవాడ స్టేషన్లో ఉదయం 6.15 గంటలకు ప్రారంభం అయ్యేది. కానీ ఇప్పుడు షెడ్యూల్ మారింది. ఇక నుంచి 15 నిమిషాల ముందుగానే ఈ ట్రైన్ బయల్దేరుతుంది. అంటే కొత్త టైం ప్రకారం.. ఉదయం 6 గంటలకే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది. Also Read: బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియా.. హిట్‌మ్యాన్, కింగ్ రిటైర్ కావడం లేదు దీంతోపాటు MMTS రైళ్ల సమయాల్లో సైతం మార్పులు జరిగాయి. జనవరి 1 నుంచి ఈ ట్రైన్ ప్రయాణ సమయాల్లో దక్షిణ మధ్య రైల్వే మార్పులు చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను అనుసంధానం చేసేందుకు వీలుగా, ప్రయాణికుల సౌకర్యార్థం ఈ మార్పులు చేసింది. ఈ మార్పులను NTES (నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్)లో చూసుకోవచ్చు.