L And T: భార్యలను ఎంతసేపు చూస్తూ కూర్చుంటారు..ఆదివారాలు పని చేయండి!

ఆదివారాలు కూడా పని చేయాలంటూ ఎల్‌ అండ్ టీ ఛైర్మన్‌ సుబ్రహ్మాణ్యన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు.వారానికి 90 గంటలు పని చేయాలి.అవసరమైతే ఆదివారాలు కూడా వదిలేసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
l and t

l and t

అభివృద్ది చెంందిన దేశాల పక్కన భారత్‌ చేరుకోవాలంటే దేశ యువత వారానికి సుమారు 70 గంటల చొప్పున పని చేయాలంటూ ఇనన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్ద చర్చకు దారితీశాయి. తాజాగా ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఆదివారాలు కూడా పని చేయాలని ఆయన ఉద్యోగులకు సూచించారు.

Also Read: Tirupati: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్

ఎంతకాలం అలా భార్యను చూస్తూ...

ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు. వారానికి 90 గంటలు పని చేయాలి . అవసరమైతే ఆదివారాలు కూడా వదిలేసుకోవాలి.ఇంట్లో తక్కువ సమయం,ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలి. ఆదివారాలు మీతో పని చేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నాను.

మీతో అలా పని చేయించగలిగితే..నాకు సంతోషం. ఎందుకంటే నేను ఆదివారాలు పని చేస్తున్నాను అంటూ వారితో ఆయన మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ కాగా..నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. భార్య ప్రస్తావన తీసుకువస్తూ ఆయన మాట్లాడిన మాటలను కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Also Read: Tirupati Stampede పై రేవంత్ రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి!

ఇదిలా ఉంటే గతంలో నారాయణమూర్తి ఓ పాడ్‌ కాస్ట్‌ లో మాట్లాడుతూ...ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో  ఉత్పాదకత తక్కువని అన్నారు. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలన్నారు. రెండో ప్రపంచ యుద్దం తరువాత జపాన్‌,జర్మనీ వంటి దేశాలు ఎలాగైతేకష్టపడ్డాయో..మనమూ అలా శ్రమించాలని అన్నారు. అభివృద్ది చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్‌ లోని యువత వారానికి 70 గంటల పాటు పని చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

దీని పై భిన్న స్పందనలు వ్యవక్తమయ్యాయి. కొందరు ఉద్యోగ జీవితంలో ఉండే ఇబ్బందులను లేవనెత్తగా..మరికొందరు మూర్తి అభిప్రాయాన్ని స్వాగతించారు.

Also Read: Us:లాస్‌ ఏంజెల్స్‌లో కార్చిచ్చు..అగ్నికి ఆహుతైన బైడెన్‌ కుమారుడి ఇల్లు

Also Read: Lay Offs: కొత్త ఏడాదిలో మొదలైన కోతలు..మైక్రోసాఫ్ట్‌ లో హూస్టింగ్ లు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు