Robin Uthappa: పీఎఫ్ ఫ్రాడ్‌ కేసుపై స్పందించిన ఉతప్ప.. సంబంధం లేదంటూ

పీఎఫ్ ఫ్రాడ్‌ కేసుపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించారు. పీఎఫ్‌ నిధుల దుర్వినియోగంలో నా ప్రమేయం లేదని, తాను ఎవరినీ మోసం చేయలేదంటూ ప్రకటన రిలీజ్ చేశాడు. తనకు రావాల్సి ఫండ్స్ కంపెనీ ఇవ్వలేదని, త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయన్నారు. 

New Update
robin utappa

రాబిన్ ఉతప్ప

Robin Uthappa: పీఎఫ్ ఫ్రాడ్‌ కేసుపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించారు. బెంగళూరుకు చెందిన సెంటారస్‌ లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ ఉద్యోగుల పీఎఫ్ చెల్లింపుల కేసులో అరెస్ట్‌ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. కాగా తాను ఎవరినీ మోసం చేయలేదని, తన గురించి తప్పుడు ఆరోపణలు రావడం బాధకరమంటూ ప్రకటన రిలీజ్ చేశాడు.  

లోన్ రూపంలో ఫండ్స్‌ ఇచ్చింది నిజమే..

ఈ మేరకు సదరు కంపెనీలో నేను ఎగ్జిక్యూటివ్‌ రోల్‌ పోషించట్లేదు. నాకు రావాల్సిన వాటిని కూడా కంపెనీ చెల్లించలేదు. అయినా నాపైనే పీఎఫ్‌ మోసం కేసు నమోదు కావడం బాధాకరం. సెంటారస్‌ లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 2018 - 19లో డైరక్టర్‌గా ఎన్నికయ్యాను. నేను పెట్టుబడి పెట్టడంతో ఆ పదవి ఇచ్చారు. లోన్ రూపంలో ఫండ్స్‌ ఇచ్చింది నిజమే.. కానీ నేనెప్పుడూ యాక్టివ్ ఎగ్జిక్యూటివ్ రోల్‌ను పోషించలేదు. రోజువారీ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. ప్రొఫెషనల్ క్రికెటర్‌గా, టీవీ ప్రెజెంటర్‌గా, కామెంటేటర్‌గా నేను చాలా బిజీగా ఉంటున్నా. కంపెనీ కార్యక్రమాల్లో ఎన్నడూ పాల్గొనలేదు. మరికొన్ని సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టిన. కానీ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు తీసుకోలేదని వివరించాడు. 

ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ బెయిల్ రద్దు!? మళ్లీ జైలుకు.. ఏసీపీ సంచలన ప్రకటన!

నా ఫండ్స్ కంపెనీ ఇవ్వలేదు..

ఇక తాను ఇచ్చిన ఫండ్స్‌ను కూడా తిరిగి చెల్లించడంలో ఈ సంస్థ విఫలమైందని చెప్పాడు. కొన్నేళ్ల కిందటే డైరక్టర్‌ పదవికి రాజీనామా చేశా. ఇప్పుడు పీఎఫ్ అధికారులు పేమెంట్‌ చేయాలని నాకు నోటీసులు జారీ చేశారు. నా లీగల్ టీమ్‌ స్పందించింది. పీఎఫ్‌ నిధుల దుర్వినియోగంలో నా ప్రమేయం లేదు. నిజాలను తెలుసుకొని మాత్రమే సమాచారం ఇవ్వండి అంటూ మీడియాను కోరాడు ఉతప్ప. ఇక రూ.23 లక్షలను ఉతప్ప తన ఉద్యోగుల ఖాతాలో జమ చేయకుండా మోసం చేశారని తేలడంతో పీఎఫ్‌ రీజనల్‌ కమిషనర్‌ అతడికి నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు