కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూడీపై ఆపార్టీ చర్యలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను పోటీ నుంచి తప్పించి.. ఆ స్థానం నుంచి ఓ మహిళా అభ్యర్థికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఎంపీ ప్రియాంక గాంధీతో పాటుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిపై కూడా రమేశ్ బిధూడీ కీలక కామెంట్స్ చేశారు. దీంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలకు రెడీ అయిపోయిందని తెలుస్తోంది. Also Read : గోవాలో రికార్డ్ స్థాయిలో పర్యాటకులు.. చైనాదంతా అబద్ధపు ప్రచారం క్లాస్ పీకిన జేపీ నడ్డా ఇదే విషయంపై కేంద్రమంత్రి జేపీ నడ్డా (JP Nadda) రమేశ్ బిధూడీ పిలిపించుకుని మాట్లాడారని తెలుస్తోంది. దీంతో రమేశ్ బిధూడీ ఇచ్చిన టికెట్ క్యాన్సి్ల్ చేయాలని అధిష్టానం ప్లాన్ లో ఉన్నట్లుగా సమాచారం. కాగా బీజేపీ ఢిల్లీలోని కాల్కాజీ నియోజకవర్గం నుంచి ఆయనకు టికెట్ కేటాయించింది. దక్షిణ ఢిల్లీ నుంచి రెండుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బిధూరి గుర్జర్ వర్గానికి చెందిన పెద్ద నాయకుడు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సైతం ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఎవరు కూడా మహిళలపై ఇటువంటి ప్రకటనలు చేయవద్దని రాజకీయ పార్టీలను హెచ్చరించారు. Also Read : వర్షం కారణంగా టాస్ ఆలస్యం.. 37ఓవర్లకు మ్యాచ్ కుదింపు రమేశ్ బిధూడీ ఏం అన్నారంటే ? కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తనను గెలిపిస్తే.. అన్ని రోడ్లను ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) చెంపలలాగా నున్నగా చేస్తానని మీకు హామీ ఇస్తున్నానంటూ రమేశ్ బిధూడీ (Ramesh Bidhuri) కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా ఢిల్లీ సీఎం అతిషిపై వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. అతిషి తన ఇంటి పేరును మార్లెనా నుంచి సింగ్‌కు మార్చుకుందని అన్నారు. 2019లో పార్లమెంటు ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి అతిషి పోటీ చేశారు. మాజీ క్రికెటర్ గంభీర్ చేతిలో ఆమె ఓటమిపాలయ్యారు. అయితే ఆ సమయంలో ప్రత్యర్థులు అతిషి ఇంటి పేరు మార్చుకుందని ప్రచారాలు చేశారు. అయితే తాజాగా రమేష్ బిదూరి మళ్లీ.. అతిషి ఇంటి పేరు మార్చుకుందని అనడంతో వివాదం చెలరేగింది. Also Read : బిగ్ షాక్ .. హైదరాబాద్లో 11 హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు రమేశ్ బిధూడీ చేసిన కామెంట్స్ పై ఢిల్లీ సీఎం అతిషి ఓ మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. దేశంలో రాజకీయాలు దిగజారిపోయాయని.. ఎన్నికల కోసం బీజేపీ నేత మా తండ్రిని అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రాజకీయాలు ఇతంలా దిగజారిపోతాయని తాను ఎప్పుడూ అనుకోలేదంటూ తెలిపారు. బిధూడీ అతిషీని మాత్రమే కాకుండా ఢిల్లీ మహిళలను కూడా అవమానించారని, దీనికి ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెబుతారని ఆప్ ట్వీట్ చేసింది. Also Read : 136 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన పాకిస్థాన్