డీజే మ్యూజిక్, దావత్ లేకుండా పెళ్లి చేసుకుంటే రూ. 21వేలు బహుమానంగా ఇస్తామని పంజాబ్‌లోని భటిండా జిల్లాలోని బల్లో గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. పెళ్లిళ్లకు వృథా ఖర్చులు చేయకుండా గ్రామస్తులను ప్రోత్సహించేందుకు, మద్యం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బల్లో గ్రామ సర్పంచ్ అమర్‌జిత్ కౌర్ తెలిపారు. మద్యం సేవించే ఫంక్షన్‌లలో గొడవలు జరగడం, గ్రామాల్లో డీజేల మ్యూజిక్ లు వినిపించడం సాధారణంగా కనిపిస్తోందని అన్నారు. అంతేకాకుండా బిగ్గరగా వినిపించే మ్యూజిక్ విద్యార్థుల చదువులకు కూడా ఆటంకం కలిగిస్తుందని తెలిపారు. 5,000 మంది జనాభా బల్లో గ్రామంలో సుమారు 5,000 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో స్టేడియం ఏర్పాటు చేయాలని పంచాయతీ ప్రభుత్వాన్ని కోరిందని, తద్వారా యువత క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు. వివిధ ఆటలు నిర్వహించేందుకు వీలుగా గ్రామంలో స్టేడియం ఉండాలని సర్పంచ్ చెప్పుకొచ్చారు. గ్రామంలో బయోగ్యాస్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయాలని పంచాయతీ ప్రతిపాదించింది. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ఉచితంగా విత్తనాలు అందజేస్తామని తెలిపారు. పంచాయతీ ఆమోదించిన ఇతర తీర్మానాలలో సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్న యువకులకు ఉచిత కోచింగ్ లు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం హైదరాబాద్‌లో డీజేలపై పోలీసులు నిషేధం విధించారు. డీజేలు, ఫైర్‌క్రాకర్స్‌పై భారీ స్థాయిలో ఫిర్యాదులు రావడంతో పోలీసులు నిషేధం విధించారు. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, మతపెద్దలతో భేటీ నిర్వహించిన అనంతరం హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ నిషే ధం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. అనుమతి ఉన్న ప్రాంతాల్లో తక్కువ శబ్దంతో అనుమతించనున్నారు. ఎవరైనా ఈ నిబంధనలను బ్రేక్ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఐదేండ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధిస్తారు. పదేపదే రిపీట్ అయితే ప్రతి రోజు రూ.5 వేల ఫైన్ కట్టాల్సి ఉంటుంది. Also Read : కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్... అఖిలేష్ యాదవ్ ఊహించని ట్విస్ట్