హోటల్ బుకింగ్ సంస్థ ఓయో నూతన చెక్ ఇన్ పాలసీని తీసుకురావడంతో ట్విట్టర్ లో ఓయో రూమ్స్ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వెళ్లింది. నెటిజన్లు తమ అభిప్రాయాలను ఎక్స్ వేదికగా పంచుకుంటున్నారు. మైనర్లను ఆపొచ్చని, కానీ పెళ్లికాని మేజర్లను ఆపడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అంటూ కొందరు పోస్టులు చేస్తున్నారు. ఓయో కంపెనీ ఈ నిర్ణయంతో దివాలా తీసే అవకాశం ఉందని మరికొందరు జోస్యం చెప్తున్నారు. ఇక సింగిల్స్ కు మాత్రం నిజంగా ఇది అదిరిపోయే వార్త అని పలువురు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యామిలీలు ఓయో రూమ్ బుక్ చేసుకోవాలంటే భయపడే పరిస్థితి నుండి...ఓయోలోనే ఉండే పరిస్థితి త్వరలో రాబోతుంది అన్నమాట అని కొందరైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 2024 ఢిల్లీ, బెంగళూరు తరువాత ఎక్కువగా ఓయో రూమ్ లు బుక్ చేసుకుంది హైదరాబాద్ లోనే కావడం విశేషం. 2024 ఢిల్లీ, బంగళూరుల తరువాత ఎక్కువగా ఓయో రూమ్ లు బుక్ అయింది హైదరాబాద్ లోనే — sidduuuuuuuuuu (@siddur260) January 3, 2025 ఫ్యామిలీ లు ఓయో లో బుక్ చేసుకోవాలంటే భయపడే పరిస్థితి నుండి...ఓయోలోనే ఉండే పరిస్థితి త్వరలో రాబోతుంది అన్నమాట. — The Whistleblower (@telugodikeka) January 5, 2025 ఇకపై ప్రూఫ్ లు అడుగుతారటఓయో రూమ్స లో..ముందుగా మీరట్ లో ఎక్స్ పెర్మెంటల్ గా మొదలుపెడుతున్నారు..కష్టమే..పాపం. — devipriya (@sairaaj44) January 5, 2025 ముందు యూపీలో ఆ తరువాత ఓయో నూతన చెక్ ఇన్ పాలసీ ప్రకారం పెళ్లి కాని జంటలు రూమ్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉండదు. ఈ నిబంధనలను తొలుత యూపీలోని మీరట్‌లో అమలుచేస్తోంది. ఆ తర్వాత దేశమంతా విస్తరించే అవకాశం ఉంది. ఇకపై రూమ్ బుకింగ్ సమయంలో జంటలు తమ పెళ్లిని నిర్ధారించే ఐడీని సమర్పించాలి. సురక్షితమైన, బాధ్యతాయుతమైన హాస్పిటాలిటీకి తాము కట్టుబడి ఉన్నామని ఓయో నార్త్ ఇండియా హెడ్ పవాస్ శర్మ తెలిపారు. ఫ్యామిలీస్, స్టూడెంట్స్, ఒంటరిగా వచ్చే ప్రయాణికులకు సెఫ్టీ అందించే విధంగా వసతులు కల్పించేందుకు కొత్త చెక్ -ఇన్ పాలసీ తీసుకొచ్చామన్నారు . మరింతమంది కస్టమర్స్, బుకింగ్స్ పెంచేందుకు తాము తీసుకొస్తున్న రూల్ ఉపయోగపడుతుందని తెలిపారు. Also Read : ప్రియాంక గాంధీ బుగ్గల్లా రోడ్లు మారుస్తా : బీజేపీ నేత సంచలన కామెంట్స్