Google: సుందర్ పిచాయ్‌కి షాక్. ఇచ్చిన ముంబయి కోర్టు!

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు ముంబై కోర్టు నోటీసులు జారీ చేసింది. జంతు సంరక్షణ కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ, దాని వ్యవస్థాపకుడ్ని లక్ష్యంగా చేసుకొని ఉన్న వీడియోను తొలగించమన్నప్పటికీ తొలగించకపోవడంతో పిచాయ్‌కు కోర్టు నోటీసులు ఇచ్చింది.

New Update
sundar

Google CEO: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌‌కి.. ముంబయి న్యాయస్థానం ధిక్కార నోటీసులు జారీ చేసింది. ‘పఖండి బాబా కి కర్తుట్’ దీనిపై విచారణ చేపట్టిన బల్లార్డ్ పీర్‌లోని అడిషినల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు.. ధ్యాన్ ఫౌండేషన్‌, దాని వ్యవస్థాపకుడు యోగి అశ్వినిని టార్గెట్ చేస్తూ పోస్ట్ అయిన వీడియోను తొలగించాలని నవంబర్ 21న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 31న బాంబే హైకోర్టు సూచనలతో దిగువ కోర్టు నోటీసులు ఇచ్చింది.

Also Read: Actress: బీచ్‌లో యోగా చేస్తుండగా..హీరోయిన్‌ ని లాక్కెళ్లిన రాకాసి అల!

కానీ కోర్టు ఉత్తర్వులు జారీచేసినా వీడియోను తొలగించకపోవడంతో పిటిషనర్ కోర్టు ధిక్కారం కింద మళ్లీ కేసు వేసినట్లు తెలుస్తుంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు అందుకు బాధ్యులుగా భావిస్తూ సుందర్ పిచాయ్‌కి నోటీసులు జారీ చేసింది.ఇక, యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియో తమ సంస్థ ప్రతిష్టతో పాటు వ్యవస్థాపకులు యోగి అశ్వినికి పరువు నష్టం కలిగించేలా ఉందని ఆరోపణలు జారీ చేసింది. చాలా అభ్యంతరకరమైన అంశాలున్న ఆ వీడియోను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టు ని అడిగారు.

Also Read: PV Sindhu: పెళ్ళి చేసుకోబోతున్న స్టార్ బ్యాడ్మింట్ ప్లేయర్ పి.వి.సింధు

విదేశాలలో ఆ వీడియో ఇంకా ఉందని, 2023 అక్టోబర్‌లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గూగుల్ ఉద్దేశపూర్వకంగా విస్మరించిందని ధ్యాన్ ఫౌండేషన్ చెప్పింది ఏ కారణాలు లేకున్నా కోర్టు తీర్పును గూగుల్ లెక్కచేయలేదని ఎన్జీవో తరఫు లాయర్ రాజు గుప్తా వాదనలు వినిపించారు. 'Pakhandi Baba ki Kartut’ అనే వీడియోను తొలగించాలని గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను యూట్యూబ్ లెక్క చేయలేదు. ఆ వీడియో తన ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించకపోవడంపై దాని మాతృ సంస్థ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కి సోమవారం ముంబయి కోర్టు ధిక్కార నోటీసులు అందించింది.

Also  Read: Chennai: కొండ చరియలు విరిగిపడి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

 జంతు సంరక్షణ సంస్థ ధ్యాన్ ఫౌండేషన్, దాని వ్యవస్థాపకుడు యోగి అశ్వినిని లక్ష్యంగా చేసుకుని యూట్యూబ్‌లో Pakhandi Baba ki Kartut’ అనే పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అయితే, తన పరువుకు భంగం కలిగించేలా ఉన్న ఈ వీడియోను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ యోగి అశ్విని ముంబయి కోర్టును 2022 అక్టోబరులో ఆశ్రయించారు.మరోవైపు, దీనిపై స్పందించిన యూట్యూబ్.. ఐటీ చట్టం 2023లోని సెక్షన్ 69-A కింద బ్లాక్ చేయగల కంటెంట్ పరువు నష్టం కిందకి రాదని తెలిపింది.

Also Read: Punjab:మాజీ డిప్యూటీ సీఎం కి టాయిలెట్లు కడిగే శిక్ష..ఎందుకో తెలుసా!

ఈ వివరణతో ఏకీభవించని కోర్టు... ఇటువంటి కేసుల్లో క్రిమినల్ కోర్టులు జోక్యం చేసుకోకుండా ఐటీ చట్టం నిరోధించలేదని పేర్కొంది. తదుపరి విచారణను జనవరి 3, 2025కి వాయిదా వేసింది. కోర్టు ధిక్కారణ నోటీసులు.. గూగుల్‌‌కు సంస్థకు భారత్‌లో ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే గేమింగ్ సంస్థ విన్‌జో ఫిర్యాదుతో కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు