Maoist: మవోయిస్టుల మనుగడను పూర్తిగా తుడిచిపెట్టేందుకు భద్రతా బలగాలు వేగంగా చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే వరుస ఎన్ కౌంటర్లతో దెబ్బతింటున్న పార్టీని నామరూపాల్లేకుండా చేసేందుకు అమరుల స్మారక స్థూపాలను టార్గెట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గడ్, బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల అతిపెద్ద స్మారక స్థూపం ధ్వంసం చేశారు పోలీసులు. మావోయిస్టుల అడ్డాగా పిలువబడే టార్రెమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోమట్‌పల్లిలో 62 అడుగుల భారీ స్మారక చిహ్నాన్నీ బాంబులతో నేలకూల్చారు. ఇందుకు సంబంధించి వీడియోను రిలీజ్ చేయగా వైరల్ అవుతోంది. రాకెట్ లాంచర్లతో దాడి.. ఇదిలా ఉంటే.. ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే సుక్మా జిల్లాలోని గోమగూడ పోలీసు క్యాంప్ పై నక్సల్స్ మెరుపు దాడి చేశారు. రాకెట్ లాంచర్లతో దాడికి పాల్పడటంతో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది కూడా చదవండి: Allu arjun: అల్లు అర్జున్ విచారణ పూర్తి.. కీలక ప్రశ్నలకు సమాధానాలివే! ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య.. ఇక బీజాపూర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులను పోలీస్ ఇన్ ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు చంపేశారు. బీజాపూర్ జిల్లా కోర్చోలి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను ప్రజా కోర్టులో ప్రవేశపెట్టిన వారిద్దరిని హత్య చేశారు. వారిద్దరూ గత కొంతకాలంగా పోలీస్ ఇన్ ఫార్మర్ గా పని చేస్తున్న కారణంగా శిక్షించామని మృతదేహం వద్ద కరపత్రం వదిలి వెళ్లారు. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కంకానార్ గ్రామానికి చెందిన ముకేష్ హెంలా అనే యువకుడిని వారాంతపు సంత నుండి మావోయిస్టులు అపహరించుకు వెళ్లారు. మహేష్ ను తమ చెరలో ఉంచుకోగా.. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.