Tamil Nadu: మంత్రిపై బురద చల్లిన వరద బాధితులు.. వీడియో వైరల్ తమిళనాడు, పుదుచ్చేరితో సహా ఇతర ప్రాంతాల్లో ఫెంగల్ తుపాను బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళనాడు మంత్రి తిరు పొన్ముడి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించగా బాధితులు ఆయనపై బురద చల్లారు. By B Aravind 03 Dec 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి తమిళనాడు, పుదుచ్చేరితో సహా ఇతర ప్రాంతాల్లో ఫెంగల్ తుపాను బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ క్రమంలోనే తమిళనాడు మంత్రి తిరు పొన్ముడి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించగా.. ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి ఆ ప్రాంతాలకు రావడంతో వరద బాధితులు ఆయనకు బురదతో స్వాగతం పలికారు. పలువురు ఏకంగా ఆయనపై బురదను చల్లారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ నేత అన్నామలై ఎక్స్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. This is the current state of affairs in Tamil Nadu. The CM and the Deputy Chief Minister were busy taking photos in the streets of Chennai while the city received very little rain and did not bother to keep track of the happenings beyond Chennai. The DIPR behaves like the media… pic.twitter.com/DvZN3UT1f0 — K.Annamalai (@annamalai_k) December 3, 2024 Also read: తల్లికి బంగారం కొనిచ్చేందుకు.. ఏకంగా ఏటీఎంనే కొల్లగొట్టిన కొడుకు? తమిళనాడులో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇది. ముఖ్యమంత్రి స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉధయనిధి చెన్నై విధుల్లో తిరుగుతూ ఫొటోలు దిగడంలో బీజీగా ఉన్నారు. నగరంలో తక్కువ వర్షం కురిసింది. అయినప్పటికీ చుట్టు పక్కల ప్రాంతాల పరిస్థితులను వాళ్లు పట్టించుకోవడం లేదు. ఈరోజు ప్రజలు వరద ప్రభావిత ప్రాంతాలకు వచ్చిన అవినీతి డీఎంకే నేత తిరు పొన్ముడిపై ప్రజలు తమ కోపాన్ని చూపించారు. ఆయనపై బురద జల్లారు. బాధితుల ఆవేదన ఏ స్థాయిలో ఉందో డీఎంకేకు ఇదో ముందస్తు హెచ్చరిక అంటూ చురకలంటించారు. Also Read: చెత్తతో నిండిపోయిన భూకక్ష్య..ప్రమాదంలో ఉన్నామంటున్న ఐరాస ఇదిలాఉండగా.. ఫెంగల్ తుపాను వల్ల తమిళనాడు, పుదుచ్చేరి అతాలకుతలం అయ్యింది. ఈ తుపాను ధాటికి ఇప్పటివరకు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీని తీవ్రతకు కొండపై నుంచి పెద్ద బండరాళ్లు కూడా దొర్లి జనావాసాలపై పడ్డాయి. పలువురు మట్టిలో కూరుకుపోయారు. వాళ్లని గుర్తించేందుకు సహాయక సిబ్బంది చర్యలు చేపట్టారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లిన మంత్రిపై బాధితులు బురద చల్లడం దుమారం రేపుతోంది. Also read: సౌత్ కొరియాలో 'ఎమర్జెన్సీ మార్షియల్ లా' ప్రకటించిన అధ్యక్షుడు Also read: రువాండాలో మరో ప్రాణాంతక వైరస్.. 15 మంది మృతి #Thiru Ponmudi #telugu-news #cyclone fengal #tamilnadu #puducherry మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి