Karnataka: బెళగావిలో రణరంగం..రిజర్వేషన్ల కోసం ఆందోళన

కర్ణాటలోని బెలగావి రణరంగంగా ఆరింది. అక్కడ లింగాయత్ పంచమసాలి వర్గీయులు తమకు విద్య, ఉద్యోగ రంగాల్లో 15 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఆందోళనకు దిగారు. 

New Update
k

బెళగావిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలు ప్రాంతాల నుంచి బెళగావికి చేరుకున్న ఆందోళనకారులు ర్యాలీలు చేస్తున్నారు.  లింగాయత్ పంచమసాలి వర్గీయులు తమకు విద్య, ఉద్యోగ రంగాల్లో 15 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ నిరసనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ  వర్గానికి చెందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 5శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే, కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రిజర్వేషన్లను మరింత పెంచాలని లింగాయత్‌ పంచమసాలీలు డిమాండ్‌ చేస్తున్నారు.  5శాతాన్ని 15కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే  విధాన సౌధను ముట్టుడిస్తామని చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళన కారుల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి వారిని చెదరగొట్టారు.

ఇది కూడా చూడండి:  బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి

ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక!

విధాన సౌధ ముందు..

సోమవారం నుంచి కర్ణాటక అసెంబ్లీలో శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తమ డిమాండ్లను పరిష్కరించుకునేందుకు ఇదే పైరన సమయమని భావించిన ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు.  సమావేశాలు జరుగుతుండగానే...విధాన సౌధ బయట ఆందోళన నిర్వహించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలిగించి లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించారు ఆందోళనకారులు. పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల కార్లను ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. అంతకుముందే ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు మృత్యుంజయ్‌ స్వామీజీతోపాటు పలువురు బీజేపీ నేతలు, ఆందోళన కారులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Syria: సైద్నాయలో సిరియా ప్రజల వెతుకులాట..దేని కోసం?

ఇది కూడా చూడండి: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు