బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫెంగల్ తుపాను ప్రభావం వల్ల తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేరీలో కూడా వరదలు పోటెత్తాయి. చెన్నై విమానశ్రయంలో కూడా ఇప్పటికే నీరు చేరింది. దీనివల్ల విమానాలు రన్‌వేలపై దిగేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. వర్షాల ప్రభావం వల్ల కొన్ని గంటల పాటు ఎయిర్‌పోర్ట్‌నే మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే చెన్నై విమానాశ్రయంలో ఓ విమానం ల్యాండ్ అయ్యేందుకు సమస్యలు తలెత్తాయి. ఆ ఫ్లైట్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. Also Read: హైబ్రిడ్ మోడల్‌కు పాక్ గ్రీన్ సిగ్నల్.. కానీ ఓ కండిషన్.. ఏంటంటే? ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ విమానం ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించింది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల విమానం నియంత్రణ కోల్పోయింది. దీంతో అది మళ్లీ గాల్లోకి ఎగిరి వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. Pilots often face challenges during landings in crosswinds, as seen recently at Chennai airport. An #Indigo plane attempted to land, but due to strong winds from #Cyclone #Fengal, it aborted the landing and took off. pic.twitter.com/2cQMqbE8qS — Mir Rafae (@MirRafae) December 1, 2024 Also Read: చెక్ పవర్ రద్దు.. కలెక్టర్లకు ఆ అధికారం కట్.. పంచాయతీ రాజ్ చట్టంలో రానున్న మార్పులివే! ఇదిలాఉండగా బంగాళఖాతంలో ఏర్పట్ట ఫెంగల్ తుపాను శనివారం సాయంత్రం నాటికి తమిళనాడు తీరాన్ని తాకింది. తీరం వెంట గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు బలంగా వీస్తున్నాయి. చాలా జిల్లాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైరు పుదచ్చేరీలో పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. దీంతో అక్కడ పర్యాటక ప్రదేశాలు మూసివేసారు. అయితే వాతావరణ పరిస్థితులు మెరుగుపడ్డాక ఇండిగో ఎయిర్‌లైన్స్ ఆదివారం ఉదయం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. Also Read: ఆప్ ఎమ్మెల్యేకు షాక్.. అపవిత్రం కేసులో రెండేళ్లు జైలు శిక్ష