BIG BREAKING: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. కంపెనీ పెట్రోల్ ధరను లీటరుకు రూ.5.30, డీజిల్ ధరను లీటరుకు రూ.3 పెంచింది.

New Update
Nayara

Nayara

పశ్చిమాసియాలో యుద్ధం ఎఫెక్ట్ వల్ల దేశంలో ఇంధన కొరత ఏర్పడింది. భారత్‌తో పాటు పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో ఇంధనం కొరత ఏర్పడటంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఇతర దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.15 పెరగ్గా.. దేశంలో రూ.5.30 పెరిగింది. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. కంపెనీ పెట్రోల్ ధరను లీటరుకు రూ.5.30, డీజిల్ ధరను లీటరుకు రూ.3 పెంచింది.

ఇది కూడా చూడండి: హిందూ మహాసముద్రంలో చైనా ‘సైలెంట్’ వార్.. భారత్ తీరంలో డ్రాగన్ నౌకల నిఘా!

ఇది కూడా చూడండి: ఇండియాకు ఇరాన్ గుడ్‌న్యూస్.. 5 మిత్రదేశాలకు హర్మూజ్ జలసంధి పర్మిషన్

దేశ వ్యాప్తంగా 6500 పైగా పెట్రోల్ పంపులు

దేశానికి 20 మిలియన్ టన్నుల సామర్థ్యంతో భారతదేశపు రెండవ అతిపెద్ద సింగిల్ సైట్ రిఫైనరీ అయిన వడినార్ ఆయిల్ రిఫైనరీని నిర్వహిస్తోంది. నయారాకు దేశ వ్యాప్తంగా 6500 పైగా పెట్రోల్ పంపులు ఉన్నాయి. గతేడాది 4,50,000 టన్నుల పాలీప్రొపీలిన్ ప్లాంట్‌తో పెట్రోకెమికల్స్ రంగంలోకి ప్రవేశించింది. నయారా ఎనర్జీని గతంలో ఎస్సార్ ఆయిల్ అని పిలిచేవారు.  

ఇది కూడా చూడండి: Vande Bharat Express: పెరుగులో పురుగులు.. ఇండియన్ రైల్వేస్‌కు భారీ జరిమానా

Advertisment
తాజా కథనాలు