Income Tax : హైదరాబాద్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. HRA మినహాయింపు పెంపు

హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు సంబంధించి ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) మినహాయింపు పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత నిర్ణయం ప్రకారం మినహాయింపు పరిమితి 50 శాతానికి పెంచింది.

New Update
new income tax

new income tax

Income Tax : హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు సంబంధించి ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) మినహాయింపు పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత నిర్ణయం ప్రకారం మినహాయింపు పరిమితి 50 శాతానికి పెంచింది. దీనికి సంబంధించి కేంద్రం ఈ మేరకు ఆదాయపు పన్ను నిబంధనలు, 2026ను నోటిఫై చేసింది. కాగా సుమారు అరవై ఏండ్ల కిందటి పాత ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో.. కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. అందులో భాగంగా ఏప్రిల్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలను  నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్‌ జారీ చేసింది.

గతంలో ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నైలను మాత్రమే మెట్రో నగరాలుగా పిలిచేవారు.  అందువల్ల ఆయా నగరాల్లో  పనిచేసే ఉద్యోగులకు మాత్కమే హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు పరిమితి 50 శాతంగా ఉండేది. అయితే ఆయా నగరాలతో పోలీ పడుతున్న హైదరాబాద్‌కూడా ప్రస్తుతం జాబితాలో చేరింది. దీంతో పాటు  బెంగళూరు, పుణె, అహ్మదాబాద్‌ను కూడా మెట్రో నగరాల సరసన చేర్చారు. ప్రస్తుతం మెట్రో నగరాల సంఖ్య 8కి చేరింది. ఇక ఈ నగరాలలో ఉంటున్న ఉద్యోగులు తమ జీతంలో 50 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ కింద పన్ను మినహాయింపు పొందడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన వారికి గతంలో ఉన్న 40 శాతమే యథాతధంగా కొనసాగుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో అంటే 2027 జులైలో ఫైల్‌ చేయబోయే రిటర్నుల సమయానికి ఇది వర్తించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. పాత పన్ను విధానంలో పన్నులను తగ్గించుకోవడానికి ఈ మార్పు ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారు మాత్రం ఈ మినహాయింపు పొందడానికి అవకాశం లేదు.

Advertisment
తాజా కథనాలు