/rtv/media/media_files/2025/04/09/V64Fmxrr2YerY3SYTfEA.jpg)
Air India
దుబాయ్ వెళ్లే ప్రయాణికులకు కీలక అప్‌డేట్. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి విమానాల రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. గతంలో ముందుజాగ్రత్త చర్యగా నిలిపివేసిన విమానాలను, ఇప్పుడు కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకు మాత్రమే పరిమితంగా నడుపుతున్నట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది.
విమానాశ్రయంలో కార్యకలాపాలకు ఆటంకం కలగడంతో, కొన్ని విమానాలను అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కు మళ్లించారు. అయితే ఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతుండటంతో, విమానాల రాకపోకలను దశలవారీగా పునరుద్ధరిస్తున్నారు. ప్రముఖ విమాన సంస్థ ఎమిరేట్స్ కూడా తన సర్వీసులను మళ్లీ స్టార్ట్ చేసింది. ఇవాళ ఉదయం 10 గంటల నుండి (దుబాయ్ టైమ్ ప్రకారం) కొన్ని విమానాలను మాత్రమే నడుపుతున్నారు.
ఇక కొన్ని విమానాలను పూర్తిగా రద్దు చేసినట్లు సంస్థ తెలిపింది. ఎవరి విమానాలైతే రద్దయ్యాయో, వారికి ఆ సమాచారాన్ని పంపిస్తున్నామని, వేరే విమానాల్లో వారికి సీట్లు కేటాయించేలా చూస్తున్నామని ఎమిరేట్స్ పేర్కొంది. ప్రయాణికులకు కలిగిన ఇబ్బందికి సంస్థ క్షమాపణలు చెప్పింది. మీరు దుబాయ్ వెళ్లే ప్లాన్‌లో ఉన్నా లేదా అక్కడి నుండి రావాలనుకున్నా.. ముందుగా మీ ఎయిర్‌లైన్ సంస్థను సంప్రదించి విమానం టైమింగ్స్ కనుక్కోవడం మంచిది. ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరే ముందే మీ ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లు లేదా అఫీషియల్ వెబ్‌సైట్‌లను చెక్ చేసుకోండి.
ఎక్స్‌ట్రా ఛార్జీలు ఏమీ చెల్లించకుండానే
ప్రయాణికులకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. విమానాలు రద్దు కావడంతో ఇబ్బంది పడుతున్న వారు ఎక్స్‌ట్రా ఛార్జీలు ఏమీ చెల్లించకుండానే ఈ కింది వాటిలో ఒకటి ఎంచుకోవచ్చు. మీ ప్రయాణాన్ని వేరే తేదీకి మార్చుకోవచ్చు లేదంటే టికెట్ క్యాన్సిల్ చేసుకుని పూర్తి డబ్బును వెనక్కి తీసుకోవచ్చు.
సహాయం కోసం ఎయిర్ ఇండియా 24 గంటల హెల్ప్‌లైన్ నంబర్లు: +91 11693 29333, +91 11693 29999. అంతేకాకుండా వాట్సాప్ నంబర్ +91 63600 12345 కు మెసేజ్ చేయవచ్చు.
అయితే దుబాయ్ విమానాలు ఆగిపోయినప్పటికీ.. అబుదాబి, రాస్ అల్ ఖైమా, షార్జా పట్టణాలకు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు మాత్రం యథావిధిగా నడుస్తాయని సంస్థ స్పష్టం చేసింది. చిక్కుకుపోయిన ప్రయాణికులను సురక్షితంగా ఇంటికి చేర్చడానికి తమ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని తెలిపింది.
Follow Us