/rtv/media/media_files/2026/03/15/chief-election-commissioner-gyanesh-kumar-2026-03-15-16-50-26.jpg)
Chief Election Commissioner Gyanesh Kumar
కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు (తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ), కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 9న అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 23న తమిళనాడులో పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్‌లో చూసుకుంటే రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి దశ ఏప్రిల్ 23, రెండో దశ ఏప్రిల్ 29న ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాతంతో కలిపి మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Also Read: తమిళనాడులో సంచలనం.. విజయ్‌కి డిప్యూటీ సీఎం పోస్టు ఆఫర్
తమిళనాడులో 234 స్థానాలు, పశ్చిమ బెంగాల్ 294, కేరళ 140, అస్సాం 126 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తంగా 824 స్థానాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 17.4 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నికల కోసం 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 25 లక్షల మంది ఎన్నికల అధికారులు విధుల్లో పాల్గొనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
Also Read: సంచలన నిర్ణయం.. CBSC పరీక్షలు రద్దు
నాలుగు రాష్ట్రాలతో పాటు, పుదుచ్చేరిలో అసెంబ్లీల పదవీకాలం మే, జూన్‌లలో వేర్వేరు తేదీల్లో ముగియనున్నాయి. దీంతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నిర్వహించింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఆయా రాష్ట్రాల్లో ఇటీవల పర్యటన చేసింది.
The Election Commission of India today announced the schedule for Assembly elections in West Bengal, Assam, Tamil Nadu, Kerala, and the Union Territory of Puducherry.#ElectionsWithNDTV#AssemblyElections2026pic.twitter.com/Qx5ODXOthu
— NDTV (@ndtv) March 15, 2026
Follow Us