డిసెంబర్ 27 అంటే రేపటి నుంచి కర్ణాటకలోని బెలగావిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తరువాతి నుంచి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. బీజేపీ.. స్వాతంత్ర్య సమరయోధులను అవమానించిందని, రాజ్యాంగాన్ని అణగదొక్కారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందుకే తాము ఈ ప్రచారాన్ని మొదలు పెట్టామని చెబుతున్నారు. బీఆర్ అంబేద్కర్‌ని బీజేపీ అవమానపరిచిందని , పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ప్రసంగంలో రాజ్యాంగాన్ని అణగదొక్కాలని ప్రయత్నించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అన్ని స్థాయిలలో.. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్..ప్రచారంలో పాదయాత్రలు, గ్రామ స్థాయి, బ్లాక్ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ర్యాలీలు ఉంటాయి. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలలోని.. నాయకులు దీనికి నాయకత్వం వహించనున్నారు. సెమినార్లు వంటి కార్యకలాపాలు, బహిరంగ సభలు, ర్యాలీలు ఒక గ్రామం నుంచి మరో గ్రామం వరకు జరుగుతాయని సీ వేణుగోపాల్ చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తరహాలోనే, కాంగ్రెస్ 2025 జనవరి 26న ఏడాదిపాటు సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్రను కూడా ప్రారంభించనుందని పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. Also Read: IARI: ఐఏఆర్ఐ డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి