ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు–సంభాల్ అల్లర్లపై సీఎం యోగి వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ అల్లర్ల మీద సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి..సామాజిక విభజనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాంటి వాళ్ళతో చాలా ప్రమాదం అని...జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

New Update
Telangana Elections 2023: కేసీఆర్‌పై యోగీ ఆదిత్యనాథ్‌ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

 కులం పేరుతో ప్రజల మధ్య విభజనలు సృష్టించి మన మధ్య ఉన్న ఐక్యతను నీరుగార్చేందుకు.. కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్న విపక్ష పార్టీలపై యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంభాల్, బంగ్లాదేశ్‌లలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మీద ఆయన కామెంట్ చేశారు.   ప్రజల మధ్య చిచ్చు పెట్టి..సామాజిక విభజనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాంటి వాళ్ళతో చాలా ప్రమాదం అని...జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  సమాజాన్ని ఏకతాటి మీదకు తీసుకువచ్చింది శ్రీరాముడని అన్నారు యోగి. 

అలాగే బంగ్లాదేశ్‌లో మైనారిటీలే హిందువుల మీద దాడులు చేయడాన్ని యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా ఖండించారు. హిందూ సన్యాసి చిన్మయ్‌ కృష్ణదాస్‌పై దేశ ద్రోహం నేరారోపణలు మోపి అరెస్టు చేశారని దుయ్యబట్టారు. అక్కడి మైనార్టీలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరోవైపు సంభాల్‌లో అల్లర్ల వెనుక బీజేపీ ప్రమేయం ఉందంటూ ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌ యాదవ్‌ చేసిన ఆరోపణలను యోగి ఖండించారు. ఎస్పీ నేతలు సోషలిస్టు సిద్ధాంత కర్త రామ్‌ మనోహర్‌ లోహియా గురించి మాట్లాడతారు తప్పా.. ఆయన భావజాలాన్ని ఏ మాత్రం అనుసరించరని ఆయన విమర్శించారు. ఇప్పటి సోషలిస్టులు రాజకీయ గూండాలు, నేరస్తుల సపోర్టు లేకుండా ముందుకు వెళ్లలేకపోతున్నారని తీవ్రంగా మాట్లాడారు. వాళ్లే లేకపోతే నీటిలో నుంచి తీసేసిన చేప పిల్లలా గిలగిలా కొట్టుకుంటారని యోగి ఎద్దేవా చేశారు.

 Also Read: భారత మొదటి ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్‌గా హైదరాబాద్‌ కంపెనీ..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు