NEET: నీట్‌ను రద్దు చేయాలి.. సీఎం విజయ్ సంచలన డిమాండ్

వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ-2026 పేపర్ లీక్ దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.  తాజాగా ఈ వ్యవహారంపై తమిళనాడు సీఎం విజయ్ స్పందించారు. నీట్‌ యూజీని మొత్తానికే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. 

New Update
CM Vijay Demands Abolish NEET Exam

CM Vijay Demands Abolish NEET Exam

వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ--2026 పేపర్ లీక్ దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.  మే 3న నిర్వహించిన నీట్‌ పరీక్షను 'జాతీయ పరీక్ష సంస్థ' (NTA) రద్దు చేసిన సంగతి తెలిసిందే. 2024 మే లో నిర్వహించిన నీట్‌ పేపర్ కూడా లీక్ అవ్వడం అప్పట్లో సంచలనం రేపింది. ఇలా వరుసగా నీట్ పేపర్ లీక్ కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై తమిళనాడు సీఎం విజయ్ స్పందించారు. నీట్‌ యూజీని మొత్తానికే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. 

Also Read: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. రెండు వాహనాలతోనే కాన్వాయ్..

నీట్ పేపర్ లీక్ కావడం, పరీక్షను రద్దు చేయడం అనేవి వ్యవస్థ లోపాలకు నిదర్శనమని విమర్శించారు. మాజీ సీఎం స్టాలిన్ కూడా నీట్‌కు మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ పరీక్ష వల్ల గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మాధ్యమానికి చెందిన విద్యార్థులు ఎక్కువగా నష్టపోతున్నట్లు చెప్పారు. అందుకే 12వ తరగతి మార్కుల ఆధారంగానే సీట్లను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు పర్మిషన్ ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 

Also Read: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం.. విమాన సర్వీసులు తగ్గింపు

ఇదిలాఉండగా నీట్ పేపర్ లీకేజ్‌ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జైపూర్‌లో ముగ్గురిని, గురుగ్రామ్‌లో ఒకరు, నాసిక్‌లో మరొకరిని.. మొత్తం అయిదుగురిని అరెస్టు చేసింది. అలాగే బుధవారం దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు వివిధ డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. అంతేకాదు ఢిల్లీలోని NTA ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి రద్దయిన పరీక్షకు సంబంధించిన డాక్యుమెంట్లను సేకరించింది. ప్రస్తుతం దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. 

Advertisment
తాజా కథనాలు