Assam: బాల్య వివాహాలపై అస్సాం కఠిన చర్య.. మరో 416 మంది అరెస్టు

అస్సాం ప్రభుత్వం బాల్య వివాహాలపై మరోసారి పంజా విసిరింది. గతంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నిర్వహించిన డ్రైవ్ మూడో దశలో భాగంగా 335 కేసులు నమోదవగా 416మంది అరెస్టు చేశారు. ఈ విషయాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు.

New Update
child marriage

child marriage

Child Marriage: అస్సాం ప్రభుత్వం బాల్య వివాహాలపై కఠిన చర్యలను కొనసాగిస్తుంది. అయితే  గతంలో 2023లో ఫిబ్రవరి,  అక్టోబర్‌లో  రెండు దశల్లో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా  ఒక డ్రైవ్‌ను ప్రారంభించింది. ఈ డ్రైవ్ మూడో దశలో భాగంగా డిసెంబర్‌ 21 రాత్రి నుంచి 22వరకు మొత్తం  335 కేసులు నమోదు చేసిన పోలీసులు 416మందిని అరెస్టుచేశారు.  ఈ విషయాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇలాంటి సాంఘిక దురాచారాలను అంతం చేయడానికి సాహసోపేతమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎక్స్ పోస్టులో తెలిపారు. 

గతంలో.. 

2023  ఫిబ్రవరిలో నిర్వహించిన  మొదటి డ్రైవ్ లో..  4,515 కేసులు నమోదు చేయగా.. 3,483 మందిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అక్టోబర్‌ రెండవ దశలో 710 కేసులు నమోదవగా..915 మందిని అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి  శర్మా  2026లోపు దీన్ని ఆపేస్తానని రాజకీయంగా సవాల్‌ చేస్తున్నానని తెలిపారు. 

ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ కు బిగుసుకుంటున్న ఉచ్చు.. మరికొద్ది సేపట్లో ఏసీపీ కీలక ప్రెస్ మీట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు