ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఎదురైంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని మరోసారి ఆప్‌కు రావాలని గతంలోనూ ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తమకు మద్దతిచ్చినందుకు అఖిలేష్ యాదవ్ కు ధన్యవాదాలు తెలిపారు కేజ్రీవాల్. యూపీతో సరిహద్దును పంచుకొనే ఢిల్లీలో అఖిలేశ్ మద్దతు తమకు లాభం చేకూరుస్తుందని ఆప్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అఖిలేష్ యాదవ్ ఆప్‌కి మద్దతు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. దేశ రాజధానిలో కేజ్రీవాల్ మహిళా అదాలత్ ప్రచారంలో కూడా ఆయన ఆప్ కు మద్దతుగా నిలిచారు. స్వతంత్రంగా పోటీ కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ నిర్ణయించింది. గతంలో 2020లో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో బీఎస్పీ మొత్తం 70 స్థానాల్లో పోటీ చేసింది, కానీ ఒక్కటి కూడా గెలవలేకపోయింది. జనవరి 07వ తేదీ మంగళవారం రోజున ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో ఫిబ్రవరి 5న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 8న జరుగుతుంది. ఢిల్లీలో అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. 70 స్థానాల్లో 62 చోట్ల విజయం సాధించింది. ఇక బీజేపీ 8 చోట్ల గెలువగా.. కాంగ్రెస్ మాత్రం ఖాతా తెరవలేదు. ఉచిత విద్యుత్, నీటి సరఫరా, విద్యా రంగంలో సంస్కరణలకుగానూ 2015 (67), 2020లో అసెంబ్లీ ఎన్నికలు వన్ సైడ్‌గా నడిచాయి. ఇప్పుడు పదేళ్ల అనంతరం ప్రభుత్వ వ్యతిరేక, అవినీతి ఆరోపణలు, సీఎం మార్పు పరిణామాలతో ఆప్ తీవ్ర పోటీ ఎదుర్కొనుంది. Also Read : రోడ్డు ప్రమాద బాధితులకు కొత్త పథకం–నితిన్ గడ్కరీ