Fire Accident:  ఐసీయూలో అగ్నిప్రమాదం: 10 మంది రోగుల మృతి!

ఒడిశాలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎస్సీబీ మెడికల్ కాలేజీలో సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ట్రామా కేర్ ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చికిత్స పొందుతున్న పది మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు.

New Update
odisha

ఒడిశాలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎస్సీబీ మెడికల్ కాలేజీలో సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రి(govt-hospital) లోని ట్రామా కేర్ ఐసీయూలో ఒక్కసారిగా మంటలు(fire accident) చెలరేగడంతో చికిత్స పొందుతున్న పది మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో రోగులను కాపాడే ప్రయత్నంలో 11 మంది ఆసుపత్రి సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు.

తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో, రోగులు గాఢనిద్రలో ఉన్న వేళ ఈ ప్రమాదం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఉన్న రోగులకు చికిత్స అందించే ఐసీయూలో మంటలు చెలరేగడంతో పరిస్థితి భీభత్సంగా మారింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు, రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నించారు.

Also Read :  టోల్ బాదుడు షురూ..  ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు.. NHAI  కీలక ప్రకటన!

సీఎం మోహన్ చరణ్ మాఝీ తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 23 మంది రోగులను ఇతర వార్డులకు తరలించారు. అయితే, వీరిలో ఏడుగురు రోగులు వార్డులు మారుస్తున్న సమయంలోనే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. ప్రాణాలకు తెగించి రోగులను కాపాడిన సిబ్బంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

Also Read :  గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు చిన్నారులు మృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు!

రూ. 25 లక్షల చొప్పున పరిహారం

ఘటన జరిగిన వెంటనే సీఎం మోహన్ చరణ్ మాఝీ, ఆరోగ్య శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్‌తో కలిసి ఆసుపత్రిని సందర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తూ, మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పూర్తిస్థాయిలో న్యాయ విచారణ జరిపించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Advertisment
తాజా కథనాలు