Pune: తహసీల్దార్‌ కార్యాలయంలో ఈవీఎం పరికరాలు ఎత్తుకెళ్లిన దొంగలు..సీసీటీవీలో రికార్డు!

పూణె జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయంలో ఈవీఎం పరికరాలు చోరీకి గురయ్యాయి. రెవెన్యూ అధికారి కార్యాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) పరికరం, కొన్ని స్టేషనరీలను దొంగిలించారు.

New Update
Pune: తహసీల్దార్‌ కార్యాలయంలో ఈవీఎం పరికరాలు ఎత్తుకెళ్లిన దొంగలు..సీసీటీవీలో రికార్డు!

Pune: మహారాష్ట్రలోని (Maharashtra)  పూణె (Pune) లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. పూణె జిల్లాలోని తహసీల్దార్ (Thahasildar) కార్యాలయంలో ఈవీఎం (EVM) పరికరాలు చోరీకి గురయ్యాయి. రెవెన్యూ అధికారి కార్యాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) పరికరం, కొన్ని స్టేషనరీలను దొంగిలించారు. ఈ మేరకు తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు మంగళవారం పోలీసులు సమాచారం అందించారు.

సీసీటీవీ లో రికార్డు..!

ఈ చోరీ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాస్వాడ్‌లోని తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఓ అధికారి తెలిపారు.

పుణె రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పంకజ్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ, “ఈవీఎం యంత్రం పరికరాలు, కొన్ని కాగితాల కట్టలు దొంగిలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ప్రమేయమున్న ముగ్గురిని పట్టుకునేందుకు బృందాలను రంగంలోకి దించారు.

ఈ మేరకు సస్వాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Also read: నితీష్‌ కుమార్‌ వెళ్లిపోయారు, మరికొంత మంది వెళ్తారు..ఉద్దవ్‌ ఠాక్రే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు