Sankranti: సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారో తెలుసా..

సంక్రాంతి అంటే ఊరూవాడా అంతా సందడిగా ఉంటుంది. ఈ సంక్రాంతికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గాలిపటాలు ఎగిరేస్తూ ఉంటారు. అసలు సంక్రాంతికి గాలి పటాలు ఎందుకు ఎగరేస్తారు? దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

New Update
sankranti

sankrati

Sankranti: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే..ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల కోసం ఎక్కడెక్కడో ఉన్నవారంతా కూడా సొంతూర్లకు చేరుకుంటుంటారు. సంక్రాంతి అంటేనే ఎన్నో సరదాలు తెచ్చిపెడుతుంది. గుమ్మాలు నిండా  రంగవల్లులు, వాకిట్లో రంగురంగుల ముగ్గులు, హరిదాసులు, గంగిరెద్దులు, పిండి వంటలు, కోడి పందేలు ,గాలి పటాల పోటీలు అన్ని కలిపి సందడి సందడిగా ఉంటుంది.

Also Read: America: దారుణం..విమానం ల్యాండింగ్‌ గేర్‌ లో శవాలు..అసలు ఎలా వచ్చాయి?

సంక్రాంతి అంటే ఊరూవాడా అంతా పండగలానే ఉంటుంది.ఈ సంక్రాంతికి చిన్నపెద్ద అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. పెద్దలు కూడా చిన్న పిల్లల మాదిరిగా అయిపోయి పంతంగులను ఎగరేస్తారు. అసలు సంక్రాంతికి గాలి పటాలు ఎందుకు ఎగరేస్తారు? దాని వెనక ఉన్న అసలు కథ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. మీకు కూడా తెలియకపోతే ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Also Read: Sheikh Hasina: బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హాసినా పాస్‌పోర్టు రద్దు!

సంక్రాంతికి పంతంగులు ఎగరేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. సాధారణంగా సంక్రాంతి చలికాలంలో వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయన కాలం నుంచి ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశిస్తాడనే విషయం తెలిసిందే. అందుకే సూర్యుడికి అంకితం చేస్తూ గాలిపటాన్ని ఎగరేస్తారు. అలాగే చలికాలం పూర్తయి వసంతంలోకి అడుగుపెడుతున్నామని చెప్పడానికి ఈ పంతంగులను ఎగరేస్తారని పెద్దలు కథలు కథలుగా చెబుతుంటారు.

దేవతలు ఆరు నెలల తరువాత..

అలాగే దేవతలు ఆరు నెలల తరువాత సంక్రాంతికి నిద్ర నుంచి లేస్తారట. వారికి స్వాగతం పలికేందుకు ఆకాశంలో గాలిపటాలను ఎగరేస్తారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే పురాణాల ప్రకారం శ్రీరాముడు.. హనుమంతుడితో పాటు తన తమ్ముడు లక్ష్మణుడు, ఇతరులతో కలిసి సంక్రాంతి రోజున గాలిపటం ఎగరేశారని, అప్పటి నుంచి సంక్రాంతికి గాలిపటం ఎగరేసే సంప్రదాయం వచ్చిందని పురాణాలు అంటున్నాయి.

గాలిపటం ఎగరేయడం కేవలం వినోదం కోసం మాత్రమే కాదు.. గాలిపటం ఎగరేయడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు జరుగుతుంది. ఈ గాలిపటాన్ని ఎగరేయడం వల్ల సూర్యుని నుంచి వచ్చే సూర్యకిరణాలు మన శరీరంపై నేరుగా ప్రసారిస్తాయి. దీనివల్ల శరీరానికి ఎంతగానో అవసరమైన విటమిన్ డీ పుష్కలంగా దొరుకుతుంది. ఫలితంగా విటమిన్ డీ కోసం ఇబ్బందులు పడాల్సిన పని లేదు. ఈ ఎండ గుండెకు కూడా చాలా మంచిది.

సుమారు 2 వేల సంవత్సరాల క్రితం నాటి నుంచే గాలిపటాల్ని ఎగరేస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. మొట్టమొదటిగా చైనాలో గాలిపటం ఎగరేశారని చెబుతుంటారు. అప్పటి నుంచి గాలిపటం ఎగరేసే సంప్రదాయం వచ్చిందని నమ్ముతుంటారు. కానీ అందులో నిజం లేదని కొందరి వాదన. మన దేశంలో కూడా  చాలా ప్రాంతాల్లో గాలిపటాలను ఎగరేస్తారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను జరుపుకునేటప్పుడు కచ్చితంగా గాలిపటాల్ని సంతోషంగా ఎగరేస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గాలిపటాలను ఎగరేస్తూ పండగను ఇంకా సరదాగా జరుపుకుంటారు.

Also Read: Nithin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు కొత్త పథకం–నితిన్ గడ్కరీ

Also Read: బంపరాఫర్ : డీజే, దావత్ లేకుండా పెళ్లి చేసుకుంటే రూ. 21వేలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు