Idli origin: భారతీయ అల్పాహారాల్లో ఇడ్లీ అనేది ఎంతో మందికి మోస్ట్ ఫేవరేట్ బ్రేక్ ఫాస్ట్. మృదువుగా, ఫ్లఫీగా ఉండే ఈ ఇడ్లీని చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఇష్టంగా తింటారు. ఎలాంటి ఆయిల్ లేకుండా కేవలం రైస్, పప్పుతో చేసే ఈ ఇడ్లీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మిగతా అల్పాహారాలతో పోలిస్తే ఇడ్లీ చాలా తేలికగా, త్వరగా కూడా జీర్ణం అవుతుంది. మరి ఇంత ఇష్టంగా తినే ఇడ్లీ ఎక్కడ పుట్టిందో తెలుసా..? ఈ స్టోరీ తెలుసుకోవడానికి కింది ఆర్టికల్ చదవండి.. ఇడ్లీ ఎక్కడ పుట్టింది..? ఇడ్లీ మూలాలు ఇండోనేషియాలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ దీనిని 'కెడ్‌లి' లేదా 'కేడారి' అని పిలిచేవారు. ఫుడ్ సైంటిస్ట్ కె.టి.ఆచార్య ప్రకారం.. ఇది 17 శతాబ్దం నుంచి 12వ శతాబ్దం మధ్య కాలంలో ఇండోనేషియాలో ఉద్భవించింది. అయితే శతాబ్దంలో హిందూ రాజులు ఇండోనేషియాను పాలించేవారట. అప్పుడు ఆ రాజులు తమ భార్యలను భార్యల కోసం లేదా పండుగల సందర్భంగా భారతదేశానికి వచ్చినప్పుడు తమతో పాటు రాయల్ చెఫ్ లను కూడా తీసుకెళ్లేవారట. అలా ఈ ఇండినేషియన్ వంటకం భారతదేశంలో చేరి.. ఇడ్లీగా మారింది. మరో కథనం ప్రకారం.. ఇడ్లీకి అరబ్‌లతో కూడా సంబంధం కలిగి ఉందని చెబుతోంది. అయితే అరబ్ ప్రజలు హలాల్ ఆహారాలు మాత్రమే తినేవారు. దాని కోసం వారు రైస్ బాల్స్ ని ఎంచుకునేవారట. ఈ రైస్ బాల్స్ ని కొంచెం చతురస్రాకారంగా చేసి, కొబ్బరి చట్నీతో కలిపి తినేవారు. ఈ పద్ధతే ఇప్పుడు ఇడ్లీ తయారీకి ప్రేరణగా మారిందని చెబుతారు. "ఇడ్లీ" అనే పదం కన్నడ పదం "ఇద్దాలిగే" లేదా సంస్కృత పదం "ఇద్దరిక" నుంచి వచ్చిందని చెబుతారు. మరికొందరు 10వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో బియ్యం, ఉరద్ పప్పుతో తయారు చేసే తెల్లటి దోక్లా ఇడాడా నుంచి ఇడ్లీ ఉద్భవించిందని అంటారు. ఇడ్లీ ఎక్కడ పుట్టినప్పటికీ ప్రస్తుతం ఇండియన్ మెనూలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరేట్ ఐటమ్ అయిపోయింది. ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ కు బిగుసుకుంటున్న ఉచ్చు.. మరికొద్ది సేపట్లో ఏసీపీ కీలక ప్రెస్ మీట్!